Asif nagar
-
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌లో రౌడీమూకల హల్చల్
-
వివాహ వేడుకలో విషాదం
సాక్షి, విజయనగర్‌కాలనీ : వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్ జగదాంబనగర్‌లో నివసించే పులిపాటి నర్సింగ్‌రావు కుమారుడు కిశోర్ వివాహం ఈ నెల 15న సికింద్రాబాద్‌లో జరిగింది. వివాహ అనంతరం ఆదివారం నిర్వహించిన విందులో పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. నర్సింగ్‌రావుకు కాటేదాన్‌లో కార్పెంటర్ కార్ఖానా ఉన్నది. అతని వద్ద టాటాఏసీ ఆటోడ్రైవర్‌గా పనిచేసే వి.శ్రావణ్‌కుమార్(25)తో పాటు ఫర్నీచర్ పాలిష్ పనిచేసే చింటు కూడా వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదై ఉన్న జోషివాడి ప్రాంతానికి చెందిన భిక్షపతి విందుకు హాజరయ్యాడు. ఆ సమయంలో చింటు, భిక్షపతి మధ్య స్వల్ప విషయమై వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇరువురి కొట్టుకున్నారు. దీంతో భిక్షపతి తన తమ్ముడు గణే‹Ù(32)కు ఫోన్ చేసి తనపై దాడిచేస్తున్నారని వెంటనే రావాల్సిందిగా కోరాడు. హాకీ స్టిక్, జాంబియాతో దాడి.. భిక్షపతి ద్వారా సమాచారం అందుకున్న తమ్ముడు గణేష్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడు. అన్న పిలుపుమేరకు హాకీ స్టిక్, జాంబియా (కత్తి)తో రాగా అక్కడి నుంచి చింటు పరారయ్యాడు. కోపంతో రగిలిపోతున్న గణే‹Ùకు అదే బస్తీలో ఉంటున్న సాయిగణేష్ (24), ఆటోడ్రైవర్ శ్రావణ్‌కుమార్ పెళ్లి మండపంలో కనిపించడంతో మీరే చింటును తప్పించారంటూ అన్నదమ్ములిద్దరు కలిసి వారిపై దాడి చేశారు. దాడిలో సాయిగణేష్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా శ్రవణ్‌కుమార్‌ను హాకీ స్టిక్‌తో తలపై తీవ్రంగా కొట్టడంతో అది విరిగిపోయింది. అనంతరం జాంబియాతో ముఖం, ఛాతి, గొంతు తదితర శరీర భాగాలపై విచక్షణారహితంగా పొడవడంతో శ్రవణ్‌కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న శ్రవణ్‌కుమార్ కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో వైద్య చికిత్స నిమిత్తం నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఉస్మానియాకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఉస్మానియా వైద్యులు అతన్ని పరీక్షించిన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అలుముకున్న విషాద ఛాయలు... శ్రవణ్‌కుమార్ కత్తిపోట్లతోపోయాడనే విషయం తెలుసుకున్న బంధుమిత్రులు పెద్ద ఎత్తున అతని ఇంటి వద్దకు చేరుకున్నారు. అందరితో చనువుగా ఉండే శ్రవణ్‌కుమార్ మృతిచెందడంతో ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలాన్ని అడిషనల్ డీసీపీ పూజిత, ఆసిఫ్‌నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ శివమారుతి ఏసీపీ వేణుగోపాల్, ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగం రవీందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు ఆకుల శ్రీనివాస్, రాజేష్లష్తో పాటు క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం శ్రవణ్‌కుమార్ మృతిదేహానికి ఆసిఫ్‌నగర్ దేవునికుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కిషన్‌రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. కిషన్‌రెడ్డి ఆదివారం ఆసిఫ్‌నగర్‌లో పర్యటిస్తున్న సమయంలో.. ఓ యువకుడు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టాడు. దీంతో పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్‌రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడిని పట్టుకొని బీజేపీ శ్రేణులు చితకబాదాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. -
ఆసిఫ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఓ ఫర్నీచర్ షాపులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్వూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. -
విద్యుదాఘాతంతో విద్యార్థులకు గాయాలు
మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని అశిఫ్ నగర్ ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో ఐదుగురు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు... అజ్రా స్కూల్ ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు సమీపంలోనే ఉన్న మసీదులో ప్రార్థనలకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఓ జీఐ వైరును పట్టుకున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై సాద్అలీ భక్షి (16), అమర్బిన్ రహీమ్(15), ఉదీన్ (14), సయ్యద్ మహమ్మద్ ఉసేన్ (11), అహ్మద్ అలి ఖాజా ఒమర్ (15) లు గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభం
గోల్కొండ: ఆసిఫ్‌నగర్ ఠాణాలో ‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభించారు. కేసు విచారణాధికారి, సీసీఎస్ ఏసీపీ సోమేశ్వర రావు సోమవారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా లాకప్‌లో వృతిచెందిన నక్కల పద్మ నివసించే భోజగుట్ట శివాజీనగర్ వెళ్లారు. వుృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. పద్మ కుమారులు సాయి, రవిలతో సుదీర్ఘంగా మాట్లాడారు. పలు వివరాలను ఆయన సేకరించారు. చోరీ కేసులో ప్రధాన నిందితులైన మంజుల, లక్ష్మీలతో పద్మకు ఉన్న పరిచయంపై కూడా ఆయన వివరాలను ఆరా తీశారు. కాగా ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలు, పద్మ కుమారులు తెలిపిన వివరాలకు సబంధం లేనట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్న దీప్తిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి దీప్తిరాజ్ ఎఫ్ఐఆర్ను నిశితంగా పరిశీలించారు. సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ నాంపల్లి: ఆసిఫ్‌నగర్ ఠాణాలో చోటుచేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్ కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. లాకప్‌డెత్ ఘటనపై సెప్టెంబరు 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, హైదరాబాదు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని కోరింది. -
పోలీసుల వేధింపులతో మహిళ మృతి
ఆసిఫ్ నగర్: పోలీసుల వేధింపులతో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. హైదరాబాద్ నగరం ఓ ఆసుపత్రిలో చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలున్నాయని ఆసిఫ్ నగర్ పోలీసులు ఓ మహిళను వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి చోరీకి సంబంధించి ఆమెను తీవ్రంగా హింసించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసుల వేధింపులు తాళలేక శనివారం అర్ధరాత్రి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆదివారం ఉదయం మృతి చెందింది.