ఆసిఫ్ నగర్: పోలీసుల వేధింపులతో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. హైదరాబాద్ నగరం ఓ ఆసుపత్రిలో చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలున్నాయని ఆసిఫ్ నగర్ పోలీసులు ఓ మహిళను వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి చోరీకి సంబంధించి ఆమెను తీవ్రంగా హింసించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే పోలీసుల వేధింపులు తాళలేక శనివారం అర్ధరాత్రి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆదివారం ఉదయం మృతి చెందింది.
పోలీసుల వేధింపులతో మహిళ మృతి
Published Sun, Aug 23 2015 7:37 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement