
సాక్షి, రంగారెడ్డి : బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనం పైనుంచి కింద పడి ఓ యువతి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. మృతురాలు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని సిమ్రాన్(22)గా గుర్తించారు. కర్ణాటకలోని ముధోల్ టౌన్ బాగల్కోట్ జిల్లాకు చెందిన సిమ్రాన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో హాస్టల్‌లో ఉంటున్నారు.
మంగళవారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో హాస్టల్ మూడో ఫ్లోర్ నుంచి కింద పడి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తన డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment