గోల్కొండ: ఆసిఫ్‌నగర్ ఠాణాలో ‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభించారు. కేసు విచారణాధికారి, సీసీఎస్ ఏసీపీ సోమేశ్వర రావు సోమవారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా లాకప్‌లో వృతిచెందిన నక్కల పద్మ నివసించే భోజగుట్ట శివాజీనగర్ వెళ్లారు.
వుృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. పద్మ కుమారులు సాయి, రవిలతో సుదీర్ఘంగా మాట్లాడారు. పలు వివరాలను ఆయన సేకరించారు. చోరీ కేసులో ప్రధాన నిందితులైన మంజుల, లక్ష్మీలతో పద్మకు ఉన్న పరిచయంపై కూడా ఆయన వివరాలను ఆరా తీశారు. కాగా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వివరాలు, పద్మ కుమారులు తెలిపిన వివరాలకు సబంధం లేనట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్న దీప్తిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి దీప్తిరాజ్ ఎఫ్‌ఐఆర్‌ను నిశితంగా పరిశీలించారు.
సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ
నాంపల్లి: ఆసిఫ్‌నగర్ ఠాణాలో చోటుచేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్ కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. లాకప్‌డెత్ ఘటనపై సెప్టెంబరు 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, హైదరాబాదు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని కోరింది.
‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభం
Published Tue, Aug 25 2015 1:15 AM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM
Advertisement