ఏసీపీ బాలుజాదవ్‌ మృతి | Nizamabad ACP Vaditya Balu Jadav Died In khammam | Sakshi
Sakshi News home page

ఏసీపీ బాలుజాదవ్‌ మృతి

Published Sat, Sep 5 2020 12:24 PM | Last Updated on Sat, Sep 5 2020 12:29 PM

Nizamabad ACP Vaditya Balu Jadav Died In khammam - Sakshi

భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న పోలీస్‌ అధికారులు

సాక్షి, కూసుమంచి(నిజామాబాద్‌): మండలంలోని లోక్యాతండాకు చెందిన వడిత్య బాలుజాదవ్‌ (54) నిజామాబాద్‌ జిల్లాలో ఏసీపీగా (ఎన్‌ఐఏ విభాగంలో) విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో గత నెల 28న రాత్రి తన ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వస్తూ మండలంలోని జీళ్లచెరువు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన సొంత గ్రామమైన లోక్యాతండాకు తరలించారు. దీంతో తండా ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుజాదవ్‌కు భార్య భాగ్యవతి, కుమారులు రాఫాప్రతాప్, అశోక్, కుమార్తె సంధ్య ఉన్నారు. 

అంచలంచెలుగా ఎదిగి..  
మృతిచెందిన బాలుజాదవ్‌ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా కష్టపడి చదివి ఎస్‌ఐగా అదిలాబాద్‌ జిల్లాలో ఉద్యోగం పొందారు. అక్కడి నుంచి విధి నిర్వహణలో నిబద్ధత చూపిస్తూ ఉత్తమ అధికారిగా మన్ననలను పొందుతూ ఏసీపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతిపై విచారణ అధికారిగా ఆయన్ను నియమించారు.పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement