Balu Jadhav
-
ఏసీపీ బాలుజాదవ్ మృతి
సాక్షి, కూసుమంచి(నిజామాబాద్): మండలంలోని లోక్యాతండాకు చెందిన వడిత్య బాలుజాదవ్ (54) నిజామాబాద్ జిల్లాలో ఏసీపీగా (ఎన్ఐఏ విభాగంలో) విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో గత నెల 28న రాత్రి తన ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తూ మండలంలోని జీళ్లచెరువు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన సొంత గ్రామమైన లోక్యాతండాకు తరలించారు. దీంతో తండా ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుజాదవ్కు భార్య భాగ్యవతి, కుమారులు రాఫాప్రతాప్, అశోక్, కుమార్తె సంధ్య ఉన్నారు. అంచలంచెలుగా ఎదిగి.. మృతిచెందిన బాలుజాదవ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా కష్టపడి చదివి ఎస్ఐగా అదిలాబాద్ జిల్లాలో ఉద్యోగం పొందారు. అక్కడి నుంచి విధి నిర్వహణలో నిబద్ధత చూపిస్తూ ఉత్తమ అధికారిగా మన్ననలను పొందుతూ ఏసీపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతిపై విచారణ అధికారిగా ఆయన్ను నియమించారు.పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇళ్లు కట్టకుండానే బిల్లులు మంజూరైనట్లు గుర్తింపు
-
గృహ నిర్మాణాలపై ‘సిట్’ దర్యాప్తు
ఖమ్మం రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు రుజువైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్పీ బాలూజాదవ్ చెప్పారు. ఖమ్మం రూరల్ మండలంలో 2004- 2014 మధ్య కాలంలో నిర్మించిన పక్కాగృహాల లబ్ధిదారుల వివరాలను తీసుకునేందుకు సోమవారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 - 2014 మధ్య ఇందిరమ్మ, ఎమ్మెల్యే కోటా కింద నిర్మించిన ఇళ్లపై సిట్ బృందం దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని తెలిపారు. ఈ బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారని, ప్రతి ఇంటిని పరిశీలించి అన్ని వివరాలు నమోదు చేస్తామని చెప్పారు. మంగళవారం ఎం.వెంకటాయపాలెంలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై 406, 409, 420, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.