
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని నిడమర్రు మండల పరిధిలోని గుణపర్రు సమీపంలో ప్రొక్లెయిన్ తీసుకువెళుతున్న లారీకి విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు తగలడంతో లారీ దగ్ధమైంది. లారీ క్లీనర్ కూడా వైర్లు తప్పించబోయి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో కిందపడి మంటల్లో కాలిపోయాడు. అయితే, డ్రైవర్, మిషన్ ఆపరేటర్‌లు క్లీనర్ అజయ్‌ను రక్షించడం మానేసి ప్రొక్లైయిన్‌ను దింపేసరికి క్లీనర్ శరీరం కాలి బూడిదైంది. క్లీనర్ అజయ్ సొంత ఊరు ఏలూరుగా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.