బొమ్మనహల్ : ఓ లారీకి విద్యుత్ తీగలు తాకడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామం నుంచి శనివారం 11 మంది కూలీలతో ఓ లారీ బొమ్మనహల్ మండలం ఉద్దేహల్‌కు వెళుతోంది. కూలీలు అందరూ లారీపైన కూర్చున్నారు.
అయితే గమ్యస్థానానికి కొద్ది దూరంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు లారీపై కూర్చున్న ఓ కూలీని తాకాయి. దాంతో పక్కపక్కనే కూర్చున్న కూలీలందరూ గాయపడ్డారు. వీరిలో గోవింద్, రత్నమ్మ, ముత్యాలమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి బొమ్మనహల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లారీకి విద్యుదాఘాతం: 11 మందికి గాయాలు
Published Sat, Sep 19 2015 2:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM
Advertisement
Advertisement