ప.గో: జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దెందులూరు చెక్ పోస్ట్ సమీపంలో లారీని టవేరా వాహనం ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
ఎనిమిది మంది ప్రయాణికులతో టవేరా వాహనం రావులపాలెం నుంచి ఏలూరు వెళుతున్నసమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా వెంకటేశ్వర గానమృత భజన బృందానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.