కర్నూలు( రాచర్ల): కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం రాచర్ల సమీపంలో సోమవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్టు తెలిసింది. ఎదురుగా వస్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.
అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డవారంతా బనగానపల్లె మండలానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లారీ- ట్రాక్టర్ ఢీ; నలుగురి మృతి
Published Mon, Apr 20 2015 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement
Advertisement