నెల్లూరు జిల్లా కోవూరులో కరెంట్ షాక్‌తో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాతపడ్డాడు.
కోవూరు : నెల్లూరు జిల్లా కోవూరులో కరెంట్ షాక్‌తో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మైథిలి సెంటర్‌లో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆదివారమైనా పనికి రావాలని ఒత్తిడి చేయడంతో శ్రీకాంత్ అనే కార్మికుడు (20) కూలీ పనులకు వెళ్లాడు.
భవనం పక్కనే విద్యుత్ తీగలు ఉన్నాయి. కమ్ములు తీస్తున్న సమయంలో విద్యుత్ తీగలను తాకడంతో షాక్‌కు గురై శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మిగతా కార్మికులు ఆందోళన చేశారు.