ఈ-సేవా కేంద్రంలో కరెంట్ షాక్‌తో రైతు మృతి | Man dies after electrocution in E-seva centre | Sakshi
Sakshi News home page

ఈ-సేవా కేంద్రంలో కరెంట్ షాక్‌తో రైతు మృతి

Published Tue, Jun 7 2016 7:48 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man dies after electrocution in E-seva centre

హైదరాబాద్: -సేవా కేంద్రంలో విద్యుదాఘాతంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతు రాములు(65) తనకున్న వ్యవసాయ భూమికి సంబంధించిన పనిపై మంగళవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ కు వచ్చాడు. -సేవా కేంద్రంలో మెట్లు ఎక్కుతూ పక్కనే ఉన్న కిటికీని పట్టుకున్నాడు. కిటికి ఇనుప చువ్వలకు పైన ఉన్న వైరు నుంచి విద్యుత్ ప్రసరించడంతో రాములు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement