e-seva
-
నిలిచిన ఈ–సేవలు..! సమ్మె బాటలో ఈ–పంచాయతీ సిబ్బంది
సూర్యపేట్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట నమ్మె చేస్తున్నారు. వీరి సమ్మె బుధవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా గ్రామ పంచాయతీల్లో ఈ–సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సేవల్లో వేగం పెంచేందుకే.. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీలను మంజూరు చేసింది. ఇందులో సేవలందించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. అయితే వారికి వేతనాలు గ్రామపంచాయతీలే చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందన్న నమ్మకంతో ఉద్యోగులు తమ డిమాండ్లతో సమ్మె బాటపట్టారు. 63 మంది ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆధారంగా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం ఈ–పంచాయతీ కార్యక్రమాన్ని 2014–15లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)లను, తర్వాత గ్రామాల్లో క్లస్టర్ల వారీగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థ ద్వారా వీరిగా కంప్యూటర్ ఆపరేటర్లనను నియామకాలు జరిగాయి. ఆపరేటర్లందరికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పరిపాలన నిధుల కింద 10శాతం కేటాయించింది. నెలకు రూ.8వేలకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీపీఎంతో పాటు ఈ–పంచాయతీ, ఆర్జేసీ ఆపరేటర్లు 63 మంది పని చేస్తున్నారు. జిల్లాలో ఒక్కో ఆపరేటర్ 8 నుంచి 10 గ్రామ పంచాయతీల్లో చేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తూ అనుసంధానకర్తలుగా వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి తమకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ–పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. జిల్లా స్థాయిలో పనిచేసే డీపీఎంలకు పే స్కేల్ అమలు చేయాలి. గ్రామాల్లో పని చేసే ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించి వేతనం చెల్లించాలి. మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఉద్యోగ సిబ్బందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగి మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. -
గోకుల్ బ్యాంకులో భారీ మోసం
-
‘మీ సేవ’లు ఇక చేయలేం
–ఎవరు ఫిర్యాదు చేసినా జరిమానాలు –మామూళ్లు ఇస్తే ఓకే... ఇవ్వకుంటే వాతే... –సర్వీసులు నిలిపేసి కక్ష సాధింపు –ఉన్నతాధికారులు చర్యలు శూన్యం –కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్న నిర్వాహకులు ఏలూరు (మెట్రో) రేషన్ కార్డుల్లో పేరు లేదా... పుట్టిన ధవీకరణ పత్రం కావాలా... మరణ ధవీకరణ నమోదు చేయాలా... ఆధార్ కావాలా... అంతా మీ సేవా.. ప్రజలకు అవసరం ఏదైనా.. ఏ శాఖ అయినా ఆయా అధికారులు చెప్పేది, ప్రజలకు గుర్తొచ్చేది మీ సేవా కేంద్రమే. అయితే ఆయా కేంద్రాల నిర్వాహకులు మాత్రం కేంద్రాన్ని నిర్వహించలేక, నిర్వహించేందుకు మామూళ్లు ఇవ్వలేక సతమతమవుతున్నారు. జిల్లాలో మొత్తం 411 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో ఇ సేవా కేంద్రం నిర్వహించాలంటే ప్రతి నెలా జిల్లా కేంద్రమైన ఏలూరులో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహించే ఉద్యోగికి 2వేల నుండి 5 వేల వరకూ చెల్లించాలి. ఈ సొమ్ములు ఇవ్వకుంటే సదరు ఉద్యోగే ఫిర్యాదులు చేయిస్తారు. ఫిర్యాదు చేయించిన అనంతరం ఆ మీ సేవపై చర్యలు తీసుకుంటారు. సదరు మీ సేవా కేంద్రానికి సర్వీసులు నిలిపేసి కక్ష సాధిస్తారు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు అనుభవిస్తున్న వేదన. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ సేవా కేంద్రాల ఉన్నతాధికారులను కలవాలంటేనే జిల్లాలోని మీ సేవా నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. కేంద్రాల్లో ఏ తప్పులు చేయకపోయినా, మీ సేవా కేంద్రానికి సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదులను సంబం«ధితాధికారులు అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఆ ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారుల ధష్టికి తీసుకెళ్లి తక్షణమే సర్వీసులు నిలిపేస్తున్నారు. విచారణ నిర్వహించకుండానే సర్వీసులు నిలిపేయడమేంటని ప్రశ్నిస్తే సదరు నిర్వాహకుల పరిస్థితి అంతే. అయితే ప్రతి నెలా అధికారులకు మామూళ్లు ఇచ్చే వారిపై మాత్రం ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాటిపై ఏచర్యలూ తీసుకోరు సరికదా ఫిర్యాదులు ఎవరి వద్ద నుండి వచ్చాయో వారి పేర్లు సదరు నిర్వాహకులకు చెబుతూ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. ఈ వ్యవస్థకు ప్రాధాన్యం ః జిల్లాలో ప్రజాహిత సేవలు ఆన్లైన్ ద్వారా అందించడం, అధికారుల పనులన్నీ ఈ ఆఫీస్ డిజిటల్ సంతకాల ద్వారా నడుస్తుండటంతో ‘ఈ’ వ్యవస్థ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీంతో ‘మీ సేవా’ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతోంది. అయితే జిల్లాలో మీ సేవలు పరిశీలించే ఉన్నతాధికారికి మాత్రం ఈ శాఖ అత్యంత ప్రీతిపాత్రంగా మారుతోంది. సిటిజన్ సర్వీసెస్ అన్నీ జిల్లాలో సిఎస్సి 219, ఎపి ఆన్లైన్133, ఆర్ఎ ఎమ్‌వో 52, డివోపి 7, సంస్ధల ఆధ్వర్యంలో మొత్తం 411 మీసేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటిపై చర్యలే లేవు ః ఇటీవల కాలంలో డెల్టా ప్రాంతానికి చెందిన నాలుగు మీసేవా సెంటర్లలో ఆదార్ నమోదుకు రు. 500 వసూలు చేస్తున్నారని నేరుగా జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేసినా సదరు కేంద్రాల నిర్వాహకులు మామూళ్లు ఇవ్వడంతో మీసేవల అధికారులు వారిపై కనీసం కన్నెత్తయినా చూడలేదు సరికదా ఆ ఫిర్యాదు నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. మెట్ట ప్రాంతంలో ఒక మీ సేవా కేంద్రంపై జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించే నారేషన్ కార్యక్రమంలో ఫిర్యాదు వచ్చినా ఆ ఫిర్యాదును పట్టించుకున్న పాపాన పోలేదు. అదే మెట్ట ప్రాంతానికి చెందిన నిర్వాహకులు నెలనెలా మామూళ్లు ఇవ్వని కారణంతో సర్వీసులే నిలిపేసి ఆ నిర్వాకుణ్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గతంలో పనిచేసిన అధికారిని ఆ విధుల నుండి తప్పించినా ప్రస్తుతం విధులు నిర్వహించే అధికారులు సైతం అదేబాటను వీడటం లేదు. కొత్త సెంటర్లకు కోరినంతః నూతనంగా మీ సేవా కేంద్రాలు పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మీసేవా సెంటర్లు ఎర్పాటు చెయ్యాలంటే అధికారులకు కోరినంత సమర్పిస్తేనే నూతన మీ సేవా కేంద్రాలు మంజూరవుతున్నాయనే వాదన వినిపిస్తుంది. సొమ్ములిస్తే కోరుకున్న సెంటర్లో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించేందుకూ అధికారులు వెనుకాడటం లేదు. సమావేశాలు ఎక్కడ ః మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను, ప్రజలకు అందించాల్సిన సేవలను తెలుపుతుండేవారు. ఈ సమావేశంలో నేరుగా జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొని ఫిర్యాదులు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేవారు. అయితే గత కొంత కాలంగా ఈ సమావేశాలే కనుమరుగయ్యాయి. –––––––––––––––––––––––– ఉద్ధేశపూర్వకంగానే ఇబ్బందులు పి.రవిశంకరబాలాజీ, మీ సేవా కేంద్రాల యూనియన్, జిల్లా అధ్యక్షుడు మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వహణలో ఉద్ధేశ పూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫిర్యాదు వచ్చినప్పుడు కనీసం తహశీల్దార్ నివేదిక కూడా అడగకుండానే జరిమానాలు విధిస్తున్నారు. కేంద్రాన్ని తొలగించాలని ఏదో ఒక కారణం చూపి వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ––––––––––––– ఇబ్బందులు ఎదురైతే నేరుగా కలవొచ్చు పులిపాటి కోటేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయండి. ప్రజలకు సేవలందించేందుకు ఉద్ధేశించి ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాల విషయంలో వాస్తవాలు వివరించండి. ఇబ్బందులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. -
ఈ-సేవా కేంద్రంలో కరెంట్ షాక్‌తో రైతు మృతి
హైదరాబాద్: ఈ-సేవా కేంద్రంలో విద్యుదాఘాతంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతు రాములు(65) తనకున్న వ్యవసాయ భూమికి సంబంధించిన పనిపై మంగళవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ కు వచ్చాడు. ఈ-సేవా కేంద్రంలో మెట్లు ఎక్కుతూ పక్కనే ఉన్న కిటికీని పట్టుకున్నాడు. కిటికి ఇనుప చువ్వలకు పైన ఉన్న వైరు నుంచి విద్యుత్ ప్రసరించడంతో రాములు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-సేవ మెయిల్ ఐడీ హ్యాకింగ్‌పై కేసు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ ఘటనపై సీసీఎస్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ చేసిన నైజీరియన్లు డబ్బును వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని యాక్సిస్ బ్యాంక్‌కు మెయిల్ పెట్టారు. దీంతో బ్యాంక్ అధికారులు ఆ ఖాతాలో కోటికి పైగా రూపాయలను బదిలీ చేశారు. వెంటనే నైజీరియన్లు దాదాపు రూ.80 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. దీనిపై ఈసేవ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. -
నగదు రహితంగా ట్రాఫిక్ చలానా
* ఇకపై చెల్లింపులన్నీ డెబిట్, క్రెడిట్, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ ద్వారానే * కొత్త విధానానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి బేగంపేట ట్రాఫిక్ సిబ్బంది చలానా రాసి డబ్బులు కట్టించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వారిని తనిఖీ చేయగా చలానా పుస్తకంలో బిల్లు కంటే సిబ్బంది జేబులో అదనంగా కొన్ని వేల రూపాయలు దొరికాయి. దీంతో ఓ ఎసై్సతో పాటు ముగ్గురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇది రెండు నెలల కిందటి సంఘటన. ఇలాంటివి తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుడి నుంచి చలానా రుసుం నగదు రూపంలో చెల్లించే విధానానికి స్వస్తి పలికారు. నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వాహనదారులు ఇక నుంచి నగదు రూపంలో చలానా రుసుము వారికి చెల్లించకూడదు. డెబిట్, క్రెడిట్, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే డబ్బులు చెల్లించాలి. ఈ కొత్త విధానం మంగళవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో అమలులోకి వచ్చింది. అంటే ఇకపై ట్రాఫిక్ సిబ్బంది కేవలం చలానాలు రాయాలి.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు వారి వద్ద ఉన్న పీడీఎఫ్ మిషన్‌తో స్వైప్ చేయాలి. అలా చేయడం ద్వారా నేరుగా వాహనదారుడి డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి జమ అవుతాయి. వాహనదారుడి వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుంటే పోలీసులు చలానా రసీదు రాసి ఇస్తారు. వారం వ్యవధిలో చలానాను పైన పేర్కొన్న ఏ ఒకదానిలోనైనా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. చలానా డబ్బులు పారదర్శకంగా ఉండేలా ఈ కొత్త విధానాన్ని దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. గతంలో వాహనదారులు చలానా మొత్తాన్ని నగదు రూపంలోనే ట్రాఫిక్ సిబ్బందికి చెల్లించేవారు. ఇలా వసూలైన డబ్బులను ఆయా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్లు మరుసటి రోజు ఐసీఐసీఐ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలో జమ చేసేవారు. కొత్త విధానంతో ఇవీ లాభాలు... * ట్రాఫిక్ సిబ్బంది అవినీతికి పాల్పడేఅవకాశం ఉండదు. * డబ్బులు వసూలు చేయడం, బ్యాంకులో జమ చేసే పనిభారం సిబ్బందికి తప్పుతుంది. * చలానా డబ్బు మొత్తంలో తేడా వస్తే అధికారే బాధ్యత వహించాల్సి వచ్చేది. * ఈ కొత్త విధానంతో డబ్బు లెక్కల్లో తేడాలు రావు * వాహనదారుడి వద్ద డబ్బు లేకున్నా చలానా రసీదు తీసుకుని వెళ్లిపోవచ్చు * చలానా ఎంత రాసినా డబ్బు నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే వెళుతుంది.