‘మీ సేవ’లు ఇక చేయలేం | we cant run e sevas | Sakshi
Sakshi News home page

‘మీ సేవ’లు ఇక చేయలేం

Published Mon, Sep 26 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

‘మీ సేవ’లు ఇక చేయలేం

‘మీ సేవ’లు ఇక చేయలేం

–ఎవరు ఫిర్యాదు చేసినా జరిమానాలు
–మామూళ్లు ఇస్తే ఓకే... ఇవ్వకుంటే వాతే...
–సర్వీసులు నిలిపేసి కక్ష సాధింపు
–ఉన్నతాధికారులు చర్యలు శూన్యం
–కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్న నిర్వాహకులు
ఏలూరు (మెట్రో)
రేషన్‌ కార్డుల్లో పేరు లేదా... పుట్టిన ధవీకరణ పత్రం కావాలా... మరణ ధవీకరణ నమోదు చేయాలా... ఆధార్‌ కావాలా... అంతా మీ సేవా.. ప్రజలకు అవసరం ఏదైనా.. ఏ శాఖ అయినా ఆయా అధికారులు చెప్పేది, ప్రజలకు గుర్తొచ్చేది మీ సేవా కేంద్రమే. అయితే ఆయా కేంద్రాల నిర్వాహకులు మాత్రం కేంద్రాన్ని నిర్వహించలేక, నిర్వహించేందుకు మామూళ్లు ఇవ్వలేక సతమతమవుతున్నారు. 
జిల్లాలో మొత్తం 411 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో ఇ సేవా కేంద్రం నిర్వహించాలంటే ప్రతి నెలా జిల్లా కేంద్రమైన ఏలూరులో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహించే ఉద్యోగికి 2వేల నుండి 5 వేల వరకూ చెల్లించాలి. ఈ సొమ్ములు ఇవ్వకుంటే సదరు ఉద్యోగే ఫిర్యాదులు చేయిస్తారు. ఫిర్యాదు చేయించిన అనంతరం ఆ మీ సేవపై చర్యలు తీసుకుంటారు. సదరు మీ సేవా కేంద్రానికి సర్వీసులు నిలిపేసి కక్ష సాధిస్తారు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు అనుభవిస్తున్న వేదన. జిల్లా కేంద్రంలో ఉన్న ఈ సేవా కేంద్రాల ఉన్నతాధికారులను కలవాలంటేనే జిల్లాలోని మీ సేవా నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. కేంద్రాల్లో ఏ తప్పులు చేయకపోయినా, మీ సేవా కేంద్రానికి సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదులను సంబం«ధితాధికారులు అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఆ ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారుల ధష్టికి తీసుకెళ్లి తక్షణమే సర్వీసులు నిలిపేస్తున్నారు. విచారణ నిర్వహించకుండానే సర్వీసులు నిలిపేయడమేంటని ప్రశ్నిస్తే సదరు నిర్వాహకుల పరిస్థితి అంతే. అయితే ప్రతి నెలా అధికారులకు మామూళ్లు ఇచ్చే వారిపై మాత్రం ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాటిపై ఏచర్యలూ తీసుకోరు సరికదా ఫిర్యాదులు ఎవరి వద్ద నుండి వచ్చాయో వారి పేర్లు సదరు నిర్వాహకులకు చెబుతూ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. 
ఈ వ్యవస్థకు ప్రాధాన్యం ః
జిల్లాలో ప్రజాహిత సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందించడం, అధికారుల పనులన్నీ ఈ ఆఫీస్‌ డిజిటల్‌ సంతకాల ద్వారా నడుస్తుండటంతో ‘ఈ’ వ్యవస్థ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీంతో ‘మీ సేవా’ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతోంది. అయితే జిల్లాలో మీ సేవలు పరిశీలించే ఉన్నతాధికారికి మాత్రం ఈ శాఖ అత్యంత ప్రీతిపాత్రంగా మారుతోంది. సిటిజన్‌ సర్వీసెస్‌ అన్నీ  జిల్లాలో సిఎస్‌సి 219, ఎపి ఆన్‌లైన్‌133, ఆర్‌ఎ ఎమ్‌వో 52, డివోపి 7, సంస్ధల ఆధ్వర్యంలో మొత్తం  411 మీసేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
వీటిపై చర్యలే లేవు ః
ఇటీవల కాలంలో డెల్టా ప్రాంతానికి చెందిన నాలుగు మీసేవా సెంటర్లలో ఆదార్‌ నమోదుకు రు. 500 వసూలు చేస్తున్నారని నేరుగా జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేసినా సదరు కేంద్రాల నిర్వాహకులు మామూళ్లు ఇవ్వడంతో మీసేవల అధికారులు వారిపై కనీసం కన్నెత్తయినా చూడలేదు సరికదా ఆ ఫిర్యాదు నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదు.
మెట్ట ప్రాంతంలో ఒక మీ సేవా కేంద్రంపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిర్వహించే నారేషన్‌ కార్యక్రమంలో ఫిర్యాదు వచ్చినా ఆ ఫిర్యాదును పట్టించుకున్న పాపాన పోలేదు. 
అదే మెట్ట ప్రాంతానికి చెందిన నిర్వాహకులు నెలనెలా మామూళ్లు ఇవ్వని కారణంతో సర్వీసులే నిలిపేసి ఆ నిర్వాకుణ్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. 
ఇటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గతంలో పనిచేసిన అధికారిని ఆ విధుల నుండి తప్పించినా ప్రస్తుతం విధులు నిర్వహించే అధికారులు సైతం అదేబాటను వీడటం లేదు. 
కొత్త సెంటర్లకు కోరినంతః 
నూతనంగా మీ సేవా కేంద్రాలు పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మీసేవా సెంటర్లు ఎర్పాటు చెయ్యాలంటే అధికారులకు కోరినంత సమర్పిస్తేనే నూతన మీ సేవా కేంద్రాలు మంజూరవుతున్నాయనే వాదన వినిపిస్తుంది. సొమ్ములిస్తే కోరుకున్న సెంటర్‌లో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించేందుకూ అధికారులు వెనుకాడటం లేదు.
సమావేశాలు ఎక్కడ ః
మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను, ప్రజలకు అందించాల్సిన సేవలను తెలుపుతుండేవారు. ఈ సమావేశంలో నేరుగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పాల్గొని ఫిర్యాదులు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేవారు. అయితే గత కొంత కాలంగా ఈ సమావేశాలే కనుమరుగయ్యాయి. 
––––––––––––––––––––––––
ఉద్ధేశపూర్వకంగానే ఇబ్బందులు
పి.రవిశంకరబాలాజీ, మీ సేవా కేంద్రాల యూనియన్, జిల్లా అధ్యక్షుడు
మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వహణలో ఉద్ధేశ పూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫిర్యాదు వచ్చినప్పుడు కనీసం తహశీల్దార్‌ నివేదిక కూడా అడగకుండానే జరిమానాలు విధిస్తున్నారు. కేంద్రాన్ని తొలగించాలని ఏదో ఒక కారణం చూపి వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.  
–––––––––––––
ఇబ్బందులు ఎదురైతే నేరుగా కలవొచ్చు
పులిపాటి కోటేశ్వరరావు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌
జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయండి. ప్రజలకు సేవలందించేందుకు ఉద్ధేశించి ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాల విషయంలో వాస్తవాలు వివరించండి. ఇబ్బందులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement