హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ ఘటనపై సీసీఎస్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ చేసిన నైజీరియన్లు డబ్బును వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని యాక్సిస్ బ్యాంక్‌కు మెయిల్ పెట్టారు. దీంతో బ్యాంక్ అధికారులు ఆ ఖాతాలో కోటికి పైగా రూపాయలను బదిలీ చేశారు. వెంటనే నైజీరియన్లు దాదాపు రూ.80 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. దీనిపై ఈసేవ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు.