లింగాల (మహబూబ్‌నగర్) : పీర్ల పండుగకని ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి దర్గా వద్ద కరెంట్ షాక్‌తో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన ఎల్లప్ప, మంగమ్మ దంపతుల ఏకైక కుమారుడు కార్తీక్(16) హైదరాబాద్‌లో ఐటీఐ చేస్తున్నాడు. సెలవులు కావటంతో మొహర్రం పండుగకుగాను దర్గాను నీటితో శుభ్రం చేసేందుకు గురువారం మోటార్ ఆన్ చేశాడు.
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకి షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు ఏటా మొహర్రం నిర్వహిస్తుంటారు. పీర్లను ఎత్తుకుంటారు. ఆక్రమంలోనే ఇంటికి వచ్చిన కార్తీక్ మృతి చెందటంతో గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కరెంట్‌షాక్‌తో విద్యార్థి మృతి
Published Thu, Oct 15 2015 5:17 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement