lingala
-
బీమా ఎగ్గొట్టావు 'పరిహారం కట్టు బాబూ': వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో... అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.పెట్టుబడి సాయం... సున్నామన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం. పంటల ధరలు దారుణంగా పతనం.. రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలంఅరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా. – పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలంపెట్టుబడి సాయం ఏది?మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు. – పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంఎప్పుడూ చూడలేదుపదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. – దినేష్‌కుమార్‌రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం -
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
చీనీ నర్సరీలతో అధిక లాభాలు
లింగాల: మండలంలో చీనీ నర్సరీలు విస్తారంగా సాగవుతున్నాయి. మండలంలోని లింగాల, పెద్దకుడాల, బోనాల, కర్ణపాపాయపల్లె, వెలిదండ్ల గ్రామాల్లోని రైతులు చీనీ నర్సరీలు విస్తారంగా సాగు చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి చీనీ నర్సరీలవల్ల లాభాలు గడిస్తున్నారు. ఏపీ, తెలంగాణా ప్రాంతాల నుంచి చీనీ మొక్కల కోసం విరివిగా వస్తున్నందున వాటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో నర్సరీల సాగు కోసం మండల రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు. జంబోరా నారుకు డిమాండ్ : చీనీ నర్సరీలు సాగు చేయాలంటే జంబోరా నారు అవసరం. ఈ నారును అన్నమయ్య జిల్లా రాజంపేటలోనే సాగు చేస్తారు. గత ఏడాది ఒక్కో జంబోరా మొక్క ఒక్క రూపాయి ఉండగా.. ప్రస్తుతం రూ.3లు పలుకుతోంది. గత ఏడాది భారీ వర్షాలవల్ల రాజంపేట ప్రాంతంలో జంబోరా విత్తనాలు మొలకెత్తకపోవడంతో అక్కడక్కడా ఉన్న జంబోరా నారుకు డిమాండ్ పెరిగిందని.. దీంతో ధరలు పెరిగాయని రైతులు అంటున్నారు. అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో లభించే జంబోరా విత్తనాలు తగినన్ని లభించకపోవడం కూడా జంబోరా నారు ధరలు పెరగడానికి కారణమంటున్నారు. ఏడాది పాటు వేచి ఉండాలి.. జంబోరా నారు నాటినప్పటి నుంచి ఆరు మాసాలు జంబోరా మొక్కలు పెంచాలి. ఆ తర్వాత నాణ్యమైన చీనీ చెట్ల నుంచి కొమ్మలు వేరు చేసి వాటికి అంట్లు కట్టాలి. అంట్లు కట్టిన ఏడాదికి చీనీ మొక్కలు చేతికందుతాయి. కూలీలకు డిమాండ్ : జంబోరా మొక్కలు నాటడానికి, వాటికి అంట్లు కట్టడానికి నైపుణ్యం గల కూలీలనే ఆశ్రయించాలి. విస్తారంగా చీనీ నర్సరీలు సాగు అవుతున్నందున కూలీలకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు కూలీ ధరలు కూడా బాగా పెరిగాయి. లాభాలు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టినా చీనీ మొక్కలకు డిమాండ్ ఉన్నందున మంచి లాభాలు వస్తు న్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు చీనీ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే నర్సరీ రైతులకు కాస్తా ఊరట లభిస్తుంది. – కేశంరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నర్సరీ రైతు), లింగాల లింగాల చీనీ మొక్కలకు డిమాండ్ లింగాల మండలంలో సాగు చేసిన చీనీ మొక్కలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ జంబోరా, రంగపూర్ మొక్కలు నాణ్యమైనవిగా పేరుగాంచింది. దీంతో ఏపీ, తెలంగాణా రైతులు వీటిపైనే మక్కువ చూపుతున్నారు. – ముచ్చుమర్రి చంద్రశేఖరరెడ్డి (చీనీ నర్సరీ రైతు), లింగాల -
అవినీతి వివాదంలో మరో ఎమ్మార్వో
నాగర్ కర్నూల్ : రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగుతూనే ఉంది. కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం వ్యవహారం ముగివకముందే మరో అవినీతి బాగోతం బయటపడింది. ఓ రైతు నుంచి లక్షా 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా లింగాల తహసీల్దార్ మళ్లిఖార్జున్ వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఎమ్మార్వో మొత్తంలో డిమాండ్ చేయగా.. రైతు తరువాత ఇస్తానని ఒప్పుకోవడంతో తొలుత అడ్వాన్స్‌గా 50 వేలు తీసుకున్నాడు. అదే పనికి మరో రైతు నుంచి అదనపు డబ్బులకు కక్కుర్తిపడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇతరులకు పట్టా పంపిణీ చేశాడు. దీంతో తిరగబడ్డ రైతులంతా శుక్రవారం తహసీల్దార్ తీరు నిరశిస్తూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. (ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్) ఈ విషయం కాస్తా పెద్దది కావడంతో వివాదం నుంచి ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తొలుత 50 తీసుకున్న రైతుకు 40 వేలు తిరిగి ముట్టజెప్పాడు. మిగతా పదివేలు కూడా ఇవ్వాలని పట్టుబట్టగా ఖర్చయ్యాయంటూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఎమ్మార్వో కారుకు రైతులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రైతులను తోసుకుంటు వెళ్లిపోయారు. (కలెక్టర్, ఆర్డీవో చెబితేనే వెళ్లాను) -
హార్టికల్చర్ హబ్.. అంతా హుళక్కే
‘వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చేస్తామంటే నిజమేనని అనుకున్నాం. లెక్కలేనని ఉప ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్తే మంచిరోజులొస్తాయని భ్రమపడ్డాం. అదుగో ఉద్యాన పంట ఉత్పత్తులు కొనేందుకు దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయంటూ హోరెత్తిస్తే నిజమేననుకున్నాం. అవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డే మమ్మల్ని బురిడీ కొట్టించారు. మా ఉద్యాన రైతుల ఆశలను అడియాశలు చేశారు’ అని వైఎస్సార్ జిల్లా రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ‘సీఎం, మంత్రి జిల్లాకు వచ్చినప్పుడల్లా హార్టికల్చర్ హబ్ అంటూ ఊదరగొట్టారు. గిట్టుబాటు ధర లేకపోతే రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి తామే పంటను కొంటామని భరోసా ఇచ్చారు. ఆ హామీలన్నీ గాలి మూటలయ్యాయి. మాకు తీవ్ర అన్యాయం చేశారు’ అని వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ‘సాక్షి’ నిర్వహించిన రచ్చబండలో రైతులు వాపోయారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి దారుణంగా మోసగించారు. ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఎక్కడ? రూ.4వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అంటూ ఎందుకు మోసగించారు? రచ్చబండలో రైతులు ఏం చెప్పారంటే.. జిల్లాలో 36 రకాలకు పైగా ఉద్యాన పంటల్ని పండిస్తున్నాం. పక్క జిల్లాలో పలు రకాల కంపెనీలను తీసుకువచ్చి దిగుబడుల్ని కొనుగోలు చేయిస్తున్నారు. అందుకు బడ్జెట్లో రూ.45 కోట్లు అదనంగా కేటాయించారు. రైపనింగ్ చాంబర్లు, కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్ యూనిట్లు, ఉప ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. మా జిల్లాపై మాత్రం చిన్న చూపు చూశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లో పులివెందుల అరటి, వీరబల్లి బేనిషా మామిడికి మంచి పేరుంది. జిల్లా నుంచి ఢిల్లీ, ముంబై, నాగపూర్, చెన్నై, వేలూరు, హైదరాబాద్, బెంగళూరు, పుణే, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ మార్కెట్లకు మేమే సొంత ఖర్చులతో ఎగుమతి చేస్తున్నాం’ అని ఓ రైతు ఇక్కట్లను ఏకరువు పెట్టాడు. మరో రైతు అందుకుంటూ ‘జిల్లాలో 1.11 లక్షల హెక్టార్లలో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, నిమ్మ, జామ, దానిమ్మ, సపోటా, పూల తోటలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నాం. ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో ఏటా రూ. 600 కోట్లు నష్టపోతున్నాం. మార్కెటింగ్ లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం. గిట్టుబాటు ధర లేనప్పుడు విలువ ఆ«ధారిత ఉత్పత్తుల తయారీకి అవసరమైన గ్రేడింగ్, ప్రాసెసింగ్, జ్యూస్, పల్ప్, పౌడర్ పరిశ్రమల యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో అయినకాడికి అమ్ముకుంటున్నాం. జిల్లాలో అరటి కోసం బనానా కోల్డ్ చైన్ పేరిట రూ.5–6 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి ఐదేళ్లవుతున్నా వాటికి దిక్కూమొక్కూలేవు. అపెడా, వాల్‌మార్ట్, ఫ్యూచర్ గ్రూప్స్, ఐఎన్ఐ కంపెనీలు జిల్లాకు వస్తున్నాయంటూ ఆశలు కల్పించినా ఒక్క కంపెనీ కూడా రాలేదు’ అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, అరటి, బొప్పాయి, చీనీ, నిమ్మ, కూరగాయల పంటలు సాగు చేసే రైతులతో 52 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైనా, మా గ్రూపుల వద్దకు వచ్చి ఇంతవరకూ పంటను కొనుగోలే చేయలేదని ఇంకొకరు వాపోయారు. జిల్లాలో సాగవుతున్న పండ్ల తోటలు (హెక్టార్లలో) 1,11,254 పండ్ల తోటల నుంచి దిగుబడి (టన్నుల్లో) 28,47,519 పంట ఉత్పత్తుల ఆదాయం (రూ. కోట్లలో) 1,775 పరిశ్రమలు లేక నష్టపోతున్న మొత్తం (రూ. కోట్లలో) 600 గ్రూపు ఏర్పాటైనా ఒరిగిందేమీ లేదు ప్రభుత్వం ఊరించడం తప్ప ఉద్యాన రైతుకు చేసిందేమీలేదు. అరటి, మామిడి, బొప్పాయి రైతులు గ్రూపులుగా ఏర్పాటవ్వాలని చెప్పారు. ఇంతవరకు ఒక టన్ను కూడా కొనుగోలు చేయలేదు. ప్రత్యేక పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. ధరల స్థిరీకరణ నిధిని రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పినా అది ఏమైందో ముఖ్యమంత్రికే తెలియాలి. ప్రతి ఏటా తక్కువ ధరకు అరటి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. –కె.చంద్రశేఖరరెడ్డి, లింగాల ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఒక్కటీ రాలేదు అరటి నుంచి జ్యూస్, క్రీములు, వడియాలు, నారు, పేపరు ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయని సీఎం పార్నపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గొప్పలు చెప్పారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులు నిల్వ ఉన్నా చెడిపోనంత నాణ్యత కలిగిన కాయలు ఇక్కడి ప్రత్యేకత. సీఎం మాటలు చెప్పడం తప్ప ఉద్యాన రైతులకు చేసిందేమీ లేదు. –ఎంసీ శేఖరరెడ్డి, లింగాల హార్టికల్చర్ హబ్ లేదు.. అంతా ఉత్తిదే హార్టికల్చర్ హబ్ వస్తుంది. పరిశ్రమలు, ఉప పరిశ్రమలు వస్తాయని ఐదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. పంటకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశించాం. అవేమీ రాలేదు. చివరకు దళారులను ఆశ్రయించి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. – అలవలపాటి ప్రతాప్‌రెడ్డి, లింగాల మార్కెట్ సదుపాయం కల్పించకుండా దగా లింగాల మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సార్లు వచ్చారు. ఇక్కడి రైతులు బంగారం పండిస్తున్నారని, అరటికి మార్కెట్ సదుపాయం కల్పిస్తామని, రైతులను లక్షాధికారుల్ని చేస్తామని నమ్మబలికారు. – ఎ.శంకరరెడ్డి, లింగాల -
కృష్ణానదిలో రవాణా పంట్ ట్రైల్‌రన్
ఇబ్రహీంపట్నం: రాజధాని నిర్మాణానికి ముడి సరకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన జలరవాణా పంట్‌కు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించారు. సుమారు 700 టన్నుల బరువు మోయగల సామర్థ్యమున్న పంట్‌పై 40 టన్నుల బరువుండే ఆరు భారీ వాహనాలను ఎక్కించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి లింగాయపాలెం రేవు వరకు నడిపారు. 240 టన్నులకే నదిలో అక్కడక్కడ భూగర్భం తగలడంతో నదిలో డ్రెడ్జింగ్ చేపట్టాలని నిర్వాహకులు గుర్తించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని అమరావతి ప్రాంతానికి తరలించాలంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దుర్గ గుడి ప్లైఓవర్ నిర్మాణంతో రాత్రివేళల్లో మాత్రమే రవాణా వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెర్రీలో ఏర్పాటు చేసిన పంట్తో ఒకేసారి 15 నుంచి 20 భారీ వాహనాలు గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు రాకుండానే గుంటూరు జిల్లా చేరుకోవచ్చు. స్థానికుల అభ్యంతరం జాతీయ రహదారి నుంచి ఫెర్రీకి భారీ వాహనాలు వెళ్తుండడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీకి వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. అక్కడినుంచి పట్టిసీమ కాలువ వెంట ఉన్న రహదారి ఇప్పటికే నాణ్యత కోల్పోయిందని, అందువల్ల భారీ వాహనాలను ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. -
చేతులెట్లాడాయో..!
- కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కడతేర్చిన మృగాడు – మద్యం మత్తులో పైశాచికం – లింగాలలో విషాద ఛాయలు అగ్నిసాక్షిగా వివాహమాడాడు. సుఖ దుఃఖాల్లో తోడు నీడలా ఉంటానని బాస చేశాడు. మూడు ముళ్ల బంధం పడిన మూడేళ్లకే ముక్కుపచ్చలారని చిన్నారితో సహా.. అర్ధాంగిని అమానుషంగా కడతేర్చాడు. తల్లీబిడ్డల దారుణ హత్య ప్రతి ఒక్కరి కంట తడి పెట్టించింది. లింగాల: లింగాల మండల కేంద్రానికి చెందిన ముచ్చుమర్రి ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసై శాడిస్ట్‌గా మారాడు. నాలుగేళ్ల క్రితం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడేళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికి మండలం కుందనకోట గ్రామానికి చెందిన పుల్లమ్మ కుమార్తె వెంకట కృష్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఈమెకు పోలియో కారణంగా కుడిచేయి చిన్నగా ఉంది. అయినా వారి దాంపత్య జీవితం సజావుగా సాగేది. అప్పుడప్పుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేసేవాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నిండు గర్భిణీగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రతాప్‌రెడ్డి అక్కడికి వెళ్లి మద్యం తాగి గొడవపడేవాడని మృతురాలి తల్లి పుల్లమ్మ తెలిపింది. దీంతో వెంకటకృష్ణమ్మ సుమారు 8 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ప్రతాప్‌రెడ్డి అత్తింటికి వెళ్లి బ్యాంకులో తన భార్య పేరిట డబ్బులున్నాయి. వాటిని డ్రా చేసుకొని తిరిగి పంపిస్తానని నమ్మబలికి సోమవారం రాత్రి 8.30 గంటలకు లింగాలకు తీసుకొచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలిక(పొలంలో కలుపు తీసే పరికరం)తో భార్య వెంకటకృష్ణమ్మ(25) తలపై కొట్టాడు. అతని నుంచి తప్పించుకొనేందుకు ఆమె బయటకు పరుగులు తీసింది. అయినా వదల్లేదు. ఇంటి ముంగిట్లోనే హతమార్చాడు. అనంతరం ఇంటిలో ఉన్న 6నెలల చిన్నారిని తొలికతో కొట్టి హతమార్చి పరారయ్యాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రతాప్‌రెడ్డి పెద్దనాన్న కుమారుడు రామచంద్రారెడ్డి వ్యవసాయ పనుల కోసం వెళుతూ అక్కడికి వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. ప్రతాప్‌రెడ్డిని ఇంట్లోనుంచి గెంటేశారు.. ప్రతాప్‌రెడ్డిని అతని కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితమే ఇంట్లో నుంచి గెంటివేశారు. మద్యానికి బానిసై ఇంటిల్లిపాదిని వేధిస్తుండటంతో అతని తల్లి, సోదరులు పొలం పనులు చేసుకొని బతుకుపో అంటూ పంపేశారు. దీంతో అతను హైస్కూలు సమీపంలో, బీసీ బాలుర వసతి గృహం ఎదురుగా ఉన్న అతని పెద్దనాన్న ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో విషాద ఛాయలు.. : ప్రతాప్‌రెడ్డి భార్యను, 6నెలల చిన్నారిని హత్య చేశాడన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్యను, పసికందును హతమార్చడం చూసి గుండెలు పగిలేలా విలపించారు. వెంకటకృష్ణమ్మ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల హృదయాలను కలిచివేసింది. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. విగత జీవుల్లా పడి ఉన్న వెంకటకృష్ణమ్మ, ఆమె కుమార్తె 6నెలల పాపను పరిశీలించారు. వారి బంధువులను విచారించారు. ఘటనకు కారకుడైన ప్రతాప్‌రెడ్డి కోసం పొలాల్లో గాలించారు. వెంకటకృష్ణమ్మ తల్లి పుల్లమ్మ, సోదరుడు వెంకటరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణుడు తెలిపారు. దిగ్భా్రంతి వ్యక్తం చేసిన నాయకులు ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదని.. పసికందు అని కూడా చూడకుండా 6నెలల పాపను హతమార్చడం కిరాతకమని వైఎస్ఆర్సీపీ మండల యూత్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి, లింగాల వైఎస్ఆర్సీపీ నాయకుడు సారెడ్డి చంద్రశేఖరరెడ్డిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
చేతులెట్లాడాయో..!
- కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కడతేర్చిన మృగాడు – మద్యం మత్తులో పైశాచికం – లింగాలలో విషాద ఛాయలు అగ్నిసాక్షిగా వివాహమాడాడు. సుఖ దుఃఖాల్లో తోడు నీడలా ఉంటానని బాస చేశాడు. మూడు ముళ్ల బంధం పడిన మూడేళ్లకే ముక్కుపచ్చలారని చిన్నారితో సహా.. అర్ధాంగిని అమానుషంగా కడతేర్చాడు. తల్లీబిడ్డల దారుణ హత్య ప్రతి ఒక్కరి కంట తడి పెట్టించింది. లింగాల: లింగాల మండల కేంద్రానికి చెందిన ముచ్చుమర్రి ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసై శాడిస్ట్‌గా మారాడు. నాలుగేళ్ల క్రితం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడేళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికి మండలం కుందనకోట గ్రామానికి చెందిన పుల్లమ్మ కుమార్తె వెంకట కృష్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఈమెకు పోలియో కారణంగా కుడిచేయి చిన్నగా ఉంది. అయినా వారి దాంపత్య జీవితం సజావుగా సాగేది. అప్పుడప్పుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేసేవాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నిండు గర్భిణీగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రతాప్‌రెడ్డి అక్కడికి వెళ్లి మద్యం తాగి గొడవపడేవాడని మృతురాలి తల్లి పుల్లమ్మ తెలిపింది. దీంతో వెంకటకృష్ణమ్మ సుమారు 8 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ప్రతాప్‌రెడ్డి అత్తింటికి వెళ్లి బ్యాంకులో తన భార్య పేరిట డబ్బులున్నాయి. వాటిని డ్రా చేసుకొని తిరిగి పంపిస్తానని నమ్మబలికి సోమవారం రాత్రి 8.30 గంటలకు లింగాలకు తీసుకొచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలిక(పొలంలో కలుపు తీసే పరికరం)తో భార్య వెంకటకృష్ణమ్మ(25) తలపై కొట్టాడు. అతని నుంచి తప్పించుకొనేందుకు ఆమె బయటకు పరుగులు తీసింది. అయినా వదల్లేదు. ఇంటి ముంగిట్లోనే హతమార్చాడు. అనంతరం ఇంటిలో ఉన్న 6నెలల చిన్నారిని తొలికతో కొట్టి హతమార్చి పరారయ్యాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రతాప్‌రెడ్డి పెద్దనాన్న కుమారుడు రామచంద్రారెడ్డి వ్యవసాయ పనుల కోసం వెళుతూ అక్కడికి వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. ప్రతాప్‌రెడ్డిని ఇంట్లోనుంచి గెంటేశారు.. ప్రతాప్‌రెడ్డిని అతని కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితమే ఇంట్లో నుంచి గెంటివేశారు. మద్యానికి బానిసై ఇంటిల్లిపాదిని వేధిస్తుండటంతో అతని తల్లి, సోదరులు పొలం పనులు చేసుకొని బతుకుపో అంటూ పంపేశారు. దీంతో అతను హైస్కూలు సమీపంలో, బీసీ బాలుర వసతి గృహం ఎదురుగా ఉన్న అతని పెద్దనాన్న ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో విషాద ఛాయలు.. : ప్రతాప్‌రెడ్డి భార్యను, 6నెలల చిన్నారిని హత్య చేశాడన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్యను, పసికందును హతమార్చడం చూసి గుండెలు పగిలేలా విలపించారు. వెంకటకృష్ణమ్మ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల హృదయాలను కలిచివేసింది. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. విగత జీవుల్లా పడి ఉన్న వెంకటకృష్ణమ్మ, ఆమె కుమార్తె 6నెలల పాపను పరిశీలించారు. వారి బంధువులను విచారించారు. ఘటనకు కారకుడైన ప్రతాప్‌రెడ్డి కోసం పొలాల్లో గాలించారు. వెంకటకృష్ణమ్మ తల్లి పుల్లమ్మ, సోదరుడు వెంకటరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణుడు తెలిపారు. దిగ్భా్రంతి వ్యక్తం చేసిన నాయకులు ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదని.. పసికందు అని కూడా చూడకుండా 6నెలల పాపను హతమార్చడం కిరాతకమని వైఎస్ఆర్సీపీ మండల యూత్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి, లింగాల వైఎస్ఆర్సీపీ నాయకుడు సారెడ్డి చంద్రశేఖరరెడ్డిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
– ఢీకొన్న బొలేరో, ద్విచక్ర వాహనం లింగాల : మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మురారిచింతల, దిగువపల్లె గ్రామాల మధ్య పులివెందుల – కోమన్నూతల రహదారిలో బొలేరో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో టీవీఎస్ వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం అడవిబ్రాహ్మణపల్లెకు చెందిన శంకర్ నాయక్(50), హనుమంతు(28) వ్యాపార నిమిత్తమై ఉదయం దిగువపల్లెకు వచ్చారు. వారు తిరిగి సాయంత్రం సొంతూరికి వెళ్తుండగా పులివెందుల నుంచి ఎగువపల్లెకు వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాల పాలైన శంకర్ నాయక్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా.. హనుమంతును పులివెందులకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. బొలేరో వాహనం ఎగువపల్లె గ్రామానికి చెందిన శివశేఖర్రెడ్డిది. శంకర్ నాయక్‌కు భార్య దేవి ఉంది. అయితే వీరికి సంతానం లేదు. హనుమంతుకు ఇంకా వివాహం కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, రూరల్ సీఐ రామకృష్ణుడు ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. -
పీబీసీ నీరు అక్రమంగా వాడుకుంటే చర్యలు
లింగాల : తుంగభద్ర నుంచి పీబీసీకి కేటాయించిన నీటిని అక్రమంగా వాడుకుంటే చర్యలు తీసుకుంటామని ఈఈ కిరణ్‌కుమార్ హెచ్చరించారు. నెల రోజులుగా తుంపెర డీప్‌కట్ కెనాల్ ద్వారా సీబీఆర్‌కు నీళ్లు వస్తున్నాయి. తుంపెర నుంచి సుమారు 16కి.మీ పొడవునా డీప్‌కట్ కెనాల్, వంకలు, వాగుల గుండా పీబీసీ నీరు సీబీఆర్‌కు చేరుతున్నాయి. నార్పల మండలం రామాపురం, ముచ్చుకుంటపల్లె, తుంపెర, తాడిమర్రి మండలంలోని పాలెం, కనుమకుంట్ల, చిన్నకొండాయపల్లె, పెద్దకోట్ల గ్రామాల మధ్య పీబీసీ నీరు ప్రవహిస్తూ సీబీఆర్‌లోకి చేరుకుంటాయి. పీబీసీ నీటిని ఆయా గ్రామాల రైతులు కాలువపై, వంకలు, వాగుల్లో అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీన సాక్షి దినపత్రికలో ‘‘తుంపెర గేట్లు ఎత్తేందుకు యత్నం’’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈఈ కిరణ్‌కుమార్ పీబీసీ సిబ్బందితో కలిసి మంగళవారం తుంపెర కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీబీసీ నీటిని ఆయా గ్రామాల రైతులు కాలువపై, వంకలు, వాగుల్లో అక్రమంగా మోటార్లు అమర్చి వాడుకోవడం వాస్తవమేనన్నారు. అక్రమ నీటి వినియోగదారులకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నేటినుంచి పోలీసు నిఘా తుంపెర కాలువ వెంబడి అమర్చిన అక్రమ విద్యుత్ మోటార్లను వెంటనే తొలగించాలని ఈఈ హెచ్చరించారు. బుధవారం నుంచి తాడిమర్రి పోలీసులచే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ నీటి వినియోగదారులపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
లింగాల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా లింగాల మండలం గునకనపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిత్తూరు జిల్లా సీలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గునకల గ్రామానికి చెందిన గంగయ్య(50), రంగయ్య(32)లు తమ టాటా ఏస్ వాహనంలో అరటి కాయల లోడుతో చిత్తూరు వెళ్తుండగా.. సీలేరు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటాఏస్‌లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్‌షాక్‌తో విద్యార్థి మృతి
లింగాల (మహబూబ్‌నగర్) : పీర్ల పండుగకని ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి దర్గా వద్ద కరెంట్ షాక్‌తో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన ఎల్లప్ప, మంగమ్మ దంపతుల ఏకైక కుమారుడు కార్తీక్(16) హైదరాబాద్‌లో ఐటీఐ చేస్తున్నాడు. సెలవులు కావటంతో మొహర్రం పండుగకుగాను దర్గాను నీటితో శుభ్రం చేసేందుకు గురువారం మోటార్ ఆన్ చేశాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకి షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యులు ఏటా మొహర్రం నిర్వహిస్తుంటారు. పీర్లను ఎత్తుకుంటారు. ఆక్రమంలోనే ఇంటికి వచ్చిన కార్తీక్ మృతి చెందటంతో గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
ఎస్ఐ వేధింపులతో విషం తాగి టవరెక్కాడు
లింగాల : పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ జిల్లా లింగాలకు చెందిన ఒక కూలీ గురువారం ఉదయం పురుగుల మందు తాగి టవర్ ఎక్కాడు. వివరాలు లింగాలకు చెందిన నారాయణరెడ్డి (35)పై వివాహేతర సంబంధం విషయమై ఒక వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ మేరకు లింగాల పోలీసులు నారాయణరెడ్డిని స్టేషన్‌కు పిలిపించి పగలంతా స్టేషన్లో ఉంచి రాత్రిపూట వదిలేవారు. పైగా ఎస్ఐ వేధింపులకు గురి చేసేవారని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. దాంతో అతను పనులకు వెళ్లక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువడంతో మనస్థాపం చెందిన నారాయణరెడ్డి ఈ రోజు ఉదయం తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగాడు. తర్వాత అక్కడే ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అతణ్ణి దించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. నారాయణ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
లింగాల (వైఎస్సార్‌జిల్లా) : ట్రాన్స్ఫార్మర్కు అల్లుకున్న తీగలను తొలగించడానికి ప్రయత్నించిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన దినేష్ రెడ్డి(18) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం బావి వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ అల్లుకున్నతీగలను తొలగించడానికి ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. -
ఎక్కడివారు అక్కడే
తమ డిమాండ్ల సాధనకోసం సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. వాహనాల్లో వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుండా నిర్భందచర్యలకు దిగడం దుర్మార్గమని అంగన్వాడీలు మండిపడ్డారు. అడ్డాకుల : జిల్లాలోని గద్వాల, ధరూర్, అ యి జ, మల్దకల్, గట్టు, వనపర్తి, కొత్తకో ట, అడ్డాకుల, వీపనగండ్లతో పాటు అ నం తపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగళి, అమరాపురం, గుడిబం డ, రోళ్ల మండలాలకు చెందిన అంగన్వా డీ కార్యకర్తలను శాఖాపూర్ టోల్‌ప్లాజా వ ద్ద పోలీసులు అడ్డుకున్నారు. రెండు ప్రై వేట్ బస్సులు, 15కు పైగా క్రూజర్ వాహనా ల్లో ఉన్న సుమారు 400 మందిని అరెస్ట్‌చేసి అడ్డాకుల ఠాణాకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ శివారులోని జీ ఎంఆర్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీం తో అంగన్వాడీ కార్యకర్తలు సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ధర్నాచేపట్టారు. జిల్లాకేంద్రంలో అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మక్తల నియోజకవర్గంలోని మాగనూర్, ఊట్కూర్‌లో అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాగనూర్‌లో పోలీస్‌స్టేషన్ ఎదుట కార్యకర్తలు ధర్నాచేపట్టారు. నారాయణపేట, ధన్వాడ, మరికల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్‌చేసి ‘పేట’, మరికల్ పోలీస్స్టేషన్లకు తరలించారు. మరికల్ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం తర్వాత అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు. కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్తున్న అంగన్వాడీలను బొంరాస్‌పేట మండలం మెట్లకుంట తండా వద్ద చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి మండలాల తరలివెళ్తున్న సుమారు 200 మందిని బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడిచిపెట్టారు. కల్వకుర్తి నుంచి వెళ్తున్నవారిని కడ్తాల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ని రసనగా కార్యకర్తలు శ్రీశైలం-హైదారాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రెండున్నర గంటల పాటు రాస్తారోకో చే పట్టారు. ఆమనగల్లు సీఐ ఫజ్లూర్ రెహమాన్ కడ్తాలకు చేరుకుని వారిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అచ్చంపేట, వంగూరు, లింగాల మం డ లాల నుంచి వెళ్తున్న అంగన్వాడీలను పో లీసులు అడ్డుకున్నారు. లింగాలలో పో లీస్ట్స్టేషన్కు తరలించారు. దీంతో వా రు సాయంత్రం వరకు అక్కడే బైఠాయిం చారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అ ధ్యక్షురాలు పార్వతమ్మను అరెస్ట్‌చేసి అచ్చంపేట పీఎస్‌కు తరలించారు.