బట్టలు ఆరేస్తున్న మహిళ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన విశాఖపట్నం గాజువాక పరిధిలోని నాకాయపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది.
విశాఖపట్నం : బట్టలు ఆరేస్తున్న మహిళ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన విశాఖపట్నం గాజువాక పరిధిలోని నాకాయపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాకాయపాలెంకు చెందిన జెస్సీ(43) అనే మహిళ ఇంటిపైన ఉన్న ఇనుప తీగపై బట్టలు ఆరేస్తున్న సమయంలో.. దాని ద్వారా విద్యుత్ ప్రవహిస్తుండటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.