అనంతపురం జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో సోమవారం ఇద్దరు రైతులు విద్యుదాఘాతంతో మృతిచెందారు.
ముదిగుబ్బ : అనంతపురం జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో సోమవారం ఇద్దరు రైతులు విద్యుదాఘాతంతో మృతిచెందారు. ముదిగుబ్బ మండలం పొడ్రాళ్లపల్లికి చెందిన రమణారెడ్డి (48), సోమందేపల్లి మండలం చాకర్లపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి (43) లుగా వారిని గుర్తించారు. తనకున్న పదెకరాల పొలంలో ఇద్దరు రైతులు బోరుబావి కింద వేరుశనగ పంట సాగు చేశాడు. పంటకు నీళ్లు పెట్టేందుకు మధ్యాహ్నం వెళ్లాడు. స్ప్రింక్లర్ పైపులు మారుస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే ముదిగుబ్బ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామిరెడ్డికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చాకర్లపల్లి గ్రామంలో రైతు శ్రీనివాసరెడ్డి(43) ఎకరా విస్తీర్ణంలో మామిడి, వంగ పంటలు సాగు చేశాడు. రెండు రోజులుగా పొలంలోని మోటారు పనిచేయడం లేదు. దీంతో సోమవారం ఉదయం మోటారుకు మరమ్మత్తులు చేయడానికి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనిచేస్తుండగా 11కేవీ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతని వెంట ఉన్న మరో రైతు కొండారెడ్డి హుటాహుటిన కుటుంబసభ్యలకు సమాచారం అందించగా అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.