సెల్ ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు.
బొల్లాపల్లి (గుంటూరు జిల్లా) : సెల్ ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రావులాపురం మండలం గుడిపాళెంలో ఆదివారం ఉదయం జరిగింది.
గ్రామానికి చెందిన భూక్యా తులసీ నాయక్(29) ఆదివారం ఉదయం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.