నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. గురువారం మెట్రో నిర్మాణ పనుల్లో పని చేస్తున్న ఒక కూలీ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
అమీర్‌పేట (హైదరాబాద్) : నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. గురువారం మెట్రో నిర్మాణ పనుల్లో పని చేస్తున్న ఒక కూలీ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో జరిగింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెన్నమనాయుడి(38)గా పోలీసులు గుర్తించారు.
చెన్నమ నాయుడు మెట్రో రైలు పనుల్లో రోజు వారి కూలీగా పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కార్మికుడి మృతి విషయాన్ని పోలీసులు మెట్రో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.