తిరువూరు (కృష్ణా జిల్లా) : పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుత్‌షాక్కు గురై మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగపాడులో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గానుగపాడు గ్రామానికి చెందిన షేక్ బడే సాహెబ్(56) గురువారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద మోటర్ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.