
సాక్షి, నిజామాబాద్ : కోటగల్లీ ప్రభుత్వం పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ వైరు తగిలి ఐదో తరగతి చదువుతున్న అయన్ ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెందాడని గ్రాహస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై విచారించేందుకు పాఠశాలకు వచ్చిన జిల్లా విద్యాధికారి (డీఈఓ)ను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. సెక్యూరిటీ మధ్య డీఈవోను పోలీసులు బయటకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment