కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త మృతి | TDP supporters injured by electrocution | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త మృతి

Published Wed, Dec 9 2015 11:51 AM | Last Updated on Fri, Aug 10 2018 6:49 PM

TDP supporters injured by electrocution

గుంటూరు : గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం ఖాజీపాలెంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు బుధవారం కరెంట్ షాక్ తగిలింది. దీంతో సహచర కార్యకర్తలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని గుంటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో వారిని గుంటూరు తరలించారు. అయితే తగిలి శ్రీనివాస్ అనే కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

మరో ఇద్దరు కార్యకర్తలు నర్సింహమూర్తి, వీరయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఖాజీపాలెంలో జనచైతన్య యాత్రను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు గ్రామంలో కడుతున్నారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను సదరు పార్టీ కార్యకర్తలు చూసుకోలేదు. దీంతో వారికి కరెంట్ షాక్ కోట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement