హైదరాబాద్ : భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి12 మంది గాయపడ్డారు. వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సకాలంలో స్థానికులు స్పందించి, పెను ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.