ఇంటిపైన ఆడుకుంటున్న విద్యార్థికి ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ధర్మవరం టౌన్ (అనంతపురం): ఇంటిపైన ఆడుకుంటున్న విద్యార్థికి ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఇంద్రానగర్‌లో గురువారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కాలనీకి చెందిన అభిషేక్(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా గురువారం ఇంటిపైన ఆడుకుంటున్న సమయంలో విద్యుత్ తీగలు చేతికి తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.