తుర్కపల్లి : నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని రాంపూర్ తండాలో ఓ బాలుడు విద్యుత్‌షాక్‌కు లోనై తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... రాంపూర్ తండాకు చెందిన ధీరావత్ అనిల్ అనే బాలుడు సోమవారం మేకలను మేపడానికి వ్యవసాయబావి వద్దకు వెళుతుండగా మార్గ మధ్యంలో బాలుడి చేతిలో ఉన్న పైపు విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. తుర్కపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందజేసి అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.