లారీపై ప్రొక్లెయినర్‌ను తరలిస్తుండగా దానిపైన ఉన్న ఆపరేటర్ విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృత్యువాతపడ్డాడు.
జి.మాడుగుల (విశాఖ) : లారీపై ప్రొక్లెయినర్‌ను తరలిస్తుండగా దానిపైన ఉన్న ఆపరేటర్ విద్యుత్ తీగలు తగిలి షాక్‌తో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం ఓబలగరువు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ప్రొక్లెయినర్‌ను తీసుకెళ్తున్న లారీ జి.మాడుగుల వైపు వెళ్తుండగా ఓబలగరువు గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన ప్రొక్లెయినర్ ఆపరేటర్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతునిది విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని ఎస్.కోట గ్రామమని సమాచారం.