Gangaraju Madugula
-
జీపు బోల్తా : ముగ్గురు మృతి
విశాఖపట్నం: జి.మాడుగుల మండలం వంజరి ఘాట్ రోడ్డులో బుధవారం జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతపల్లి నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత
జి.మాడుగుల (విశాఖ) : లారీపై ప్రొక్లెయినర్ను తరలిస్తుండగా దానిపైన ఉన్న ఆపరేటర్ విద్యుత్ తీగలు తగిలి షాక్తో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం ఓబలగరువు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రొక్లెయినర్ను తీసుకెళ్తున్న లారీ జి.మాడుగుల వైపు వెళ్తుండగా ఓబలగరువు గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన ప్రొక్లెయినర్ ఆపరేటర్ షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతునిది విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని ఎస్.కోట గ్రామమని సమాచారం. -
పది కిలోల గంజాయి స్వాధీనం
జి.మాడుగుల (విశాఖపట్నం జిల్లా) : జి.మాడుగుల మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు సమీపంలో పది కిలోల గంజాయిని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని బైక్పై అనకాపల్లి తరలిస్తుండగా పోలీసులు ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేసి పట్టుకున్నారు. పట్టుబడినవారిలో ఓ మహిళ కూడా ఉంది. వారిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.