విశాఖపట్నం: జి.మాడుగుల మండలం వంజరి ఘాట్ రోడ్డులో బుధవారం జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతపల్లి నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.