న్యూఢిల్లీ: ఢిల్లీలో రుతుపవనాల తాకిడికి శనివారం జోరుగా వర్షం కురిసిన వర్షాలు ఒక యువతిని బలితీసుకున్నాయి. గుంతలుగా మారిన రోడ్డులో నడుస్తూ పొరపాటున కరెంటు స్తంభానికి వేలాడుతున్న వైర్లను తాకడంతో తాకడంతో యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి.
తూర్పు ఢిల్లీలోని ప్రీతి విహార్ లో నివాసముండే సాక్షి అహూజా తెల్లవారుజాము 5.30 నిముషాలకు ఇద్దరు పెద్దవాళ్ళు ముగ్గురు చిన్నారులతో రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తోంది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్థంభంవైపు అడుగు వేసిన ఆ యువతికి కింద వేలాడుతున్న వైర్లు తాకి అక్కడికక్కడే కూలబడిపోయింది.
అక్కడే ఉన్న ఆమె సోదరి మాధవి చోప్రా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాక్షి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఆమె సోదరి మరణించినట్లు సంబంధిత అధికారులపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విపరీతమైన ఉక్కపోతతో వేసవిపై విసుగెత్తిపోయిన తరుణంలో తొలకరి చినుకులు ఎట్టకేలకు పలకరించాయని సంతోషించేంతలోపే ఢిల్లీలో పెనువిషాదం చోటు చేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురైయ్యారు.
ఇది కూడా చదవండి: ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment