కడప: అధికార టీడీపీ నాయకుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అధికారం ఉందన్న అహంకారంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి మున్సిపల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు గందరగోళం సృష్టించారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా వేయాలంటూ వీరంగమాడారు. ఎజెండా ప్రతాలను చించేసి చెలరేగిపోయారు.
టీడీపీ కౌన్సిలర్ల చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం సమావేశం కొనసాగించాలని వైఎస్ఆర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎజెండా పత్రాలను చించేసిన టీడీపీ కౌన్సిలర్లు
Published Mon, Sep 1 2014 1:41 PM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement
Advertisement