
రాయచోటిలోని సాయిబాబా ఆలయం-ఇన్ సెట్ లో విగ్రహం
వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
రాయచోటి: వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మధ్యాహ్నం ఆలయానికి తాళం వేశారు. ఆ సమయంలో ఒక వ్యక్తి కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. లోపల ఉన్న సాయిబాబా పాలరాతి విగ్రహం ముక్కు, గడ్డంపై పెచ్చులు ఊడగొట్టాడు. విగ్రహం ముఖంపై మూడు చోట్ల పెచ్చులు లేచిపోయి విగ్రహం పాడైపోయింది.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి వివరణ ఇస్తూ ఆలయంలోనికి ప్రవేశించిన వ్యక్తి బొట్టు పెట్టుకొని ఉన్నాడని తెలిపారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తిలా ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఎటువంటి మత సంబంధమైన అంశంలేదని తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి హిందువేనని చెప్పారు. స్థానికులు శాంతి భద్రతలకు సహకరించాలని ఆ పోలీస్ అధికారి కోరారు.
**