రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 21వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ రోజు రాయచోటిలో జరిగే రచ్చబండలో పాల్గొంటారు.
సాక్షి, కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 21వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు.
ఆ రోజు రాయచోటిలో జరిగే రచ్చబండలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు జిల్లాలో ఉంటారు.
అనంతరం ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా కలికిరికి బయలుదేరి వెళతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కడప ఆర్డీఓ హరిత బుధవారం రాయచోటిలో పర్యటించి సీఎం పాల్గొనే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.