చంద్రబాబుది నియంత పాలన | Chandrababudi dictator regime | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది నియంత పాలన

Published Wed, Dec 28 2016 11:55 PM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM

చంద్రబాబుది నియంత పాలన - Sakshi

చంద్రబాబుది నియంత పాలన

– ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి  
రాయచోటి :  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా  నియంత పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పింఛన్లు, పక్కాగృహాలు, ఇన్‌పుట్‌సబ్సిడీ వంటివి తమ కనుసైగల్లోనే జరగాలని, ఎటువంటి రాజ్యాంగ పదవులలో లేనివారు ఆదేశాలు ఇస్తుండడం, దానిని అధికారులు పాటించడం దుర్మార్గమైన చర్య అన్నారు. 2004–2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో పేదలందరికీ మంచి చేయాలన్న తలంపుతో రాయచోటి పరిధిలోనే 30 నుంచి 40 వేల పింఛన్లు, అదేతరహాలో పక్కాగృహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం పింఛన్లు మంజూరు  నియోజకవర్గ టీడీపీ నాయకుల చేతుల్లోకిపోయాయన్నారు. ఐఏఎస్‌లు అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేదని నేడు కొంత మంది పార్టీల కండువాలు వేసుకుని పనిచేసే స్ధాయికి దిగజారడం బాధకరమన్నారు. పెద్దనోట్ల రద్దు జరిగి 50 రోజులు అవుతున్నా నగదు కష్టాలు తీరలేదు.  బ్యాంక్‌ల రోజు రోజుకు కష్టాలు పెరుగుతునే ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాలన్న ఆదేశాలను టీడీపీ నాయకులు ఇస్తుండడం బాధకరమన్నారు. ఇటువంటి దృష్టపాలనను తిరిగి రానీయకుండా ప్రజలందరూ అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పిన విధంగా ప్రతి రైతుకు పెన్షన్‌ ఇచ్చే పథకాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ దుష్టపాలనకు నిరసనగా, పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండబోతున్నామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement