
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్ షాపులో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాయచోటి అగ్నిమాపక బృందం అరకొర నీటితో అక్కడికి వచ్చింది. మధ్యలోనే నీళ్లు లేక అగ్నిమాపక సిబ్బంది వెనుదిరిగింది. భవంతిలోని సామాగ్రి కాలి బూడిదైంది. లక్కిరెడ్డిపాలెం అగ్నిమాపక దళం వచ్చినా.. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బాధితులను పరామర్శించారు. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment