రాయచోటిలో విషాదం | Tragedy in the rayachoti | Sakshi
Sakshi News home page

రాయచోటిలో విషాదం

Published Sun, Dec 10 2017 7:42 PM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

Tragedy in the rayachoti

వైఎస్సార్‌ జిల్లా : రాయచోటి పాలిటెక్నిక్ సమీపంలో ఓ కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఆదివారం సెలవు కావడంతో రాయచోటి మండలం మాసాపేటకి చెందిన హర్ష, బాలాజీతో పాటు మరో నలుగురు ఈత కొట్టేందుకు  వెళ్లారు. ప్రమాదవశాత్తూ హర్ష, బాలాజీ మునిగి చనిపోయారు. హర్ష(11) రాయచోటిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

బాలాజీ మాసాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతులిద్దరినీ వెలికి తీశారు. హర్ష, బాలాజీ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement