రాయచోటి, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే వృద్ధుల పెన్షన్‌ను రూ. 200 నుండి రూ.700 లకు పెంచడం జరుగుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెన్నముక్కపల్లె పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్ శ్రీనివాసులురెడ్డితో కలసి ఎమ్మెల్యే వృద్ధులు, వికలాంగ, వితంతువులకు రూ.3.44 లక్షల పెన్షన్ డబ్బులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన పెన్షన్‌దారులతో మాట్లాడుతూ వృద్ధులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న రూ. 200 పెన్షన్ వారి మందుల కొనుగోలుకు కూడా చాలడం లేదన్నారు.
ఈవిషయాన్ని గుర్తెరిగి రూ.200 పింఛన్‌ను రూ.700లకు పెంచేందుకు జగన్ సుముఖంగా వున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు విషయాన్ని ప్రకటిస్తారన్నారు. గ్రామంలోని చెన్నముక్కపల్లె, దూళ్ళవారిపల్లెలకు కూడా రోళ్లమడుగు నీరందేలా చూస్తానంటూ చెప్పారు. గ్రామంలోని అర్హులందరికీ ఇళ్ళపట్టాలతో పాటు పక్కాగృహాల మంజూరుకు కృషి చేస్తానంటూ హామీఇచ్చారు.మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి, గ్రామ నేతలు, పంచాయతీ కార్యదర్శి భాస్కరాచారి, సీఎస్‌సీ లక్ష్మిసుజాత పాల్గొన్నారు.
జగన్ సీఎం అయితే పింఛన్ పెంపు
Published Mon, Dec 9 2013 4:09 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM
Advertisement