gadikota srikanth
-
మహానేతకు భారతరత్న ఇవ్వాలి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : సంక్షేమ పథకాల ప్రదాత, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు డిమాండ్ చేశారు. పేదలకు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు వైఎస్సార్.. భారతరత్నకు అన్ని రకాల అర్హుడన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో మహనేత మొదటి స్థానంలో నిలుస్తారని, దేశవ్యాప్తంగా సర్వేలు చేసి మహనేతకు భారతరత్న ఇవ్వాలన్నారు. పేదలకు దేవుడిలాగా అండగా నిలిచిన అపరభగీరధుడు మహనేత వైఎస్సార్ అంటూ కొనియాడారు. బుధవారం మహానేత 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి, విగ్రహానికి, వైఎస్సార్ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు నివాళులర్పించారు. ( అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం ) ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఆభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి, జకీయా ఖానంలు మాట్లాడుతూ..‘‘ ప్రతి ఒక్కరు స్మరించుకుంటున్న మహానాయకుడు వైఎస్సార్. సంక్షేమానికి పెట్టిన పేరు వైఎస్సార్. రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల, మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన నాయకుడు వైఎస్సార్. మహనేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తండ్రి తరహాలోనే తనయుడి పాలన కొనసాగుతోంది. తండ్రి అకాల మరణం తర్వాత తనయుడు ఏపీ ప్రజల సంక్షేమం తన భుజాల మీద వేసుకుని పాలన కొనసాగిస్తున్నారు. ఆయన బాటలో మేము నడవడం గర్వంగా భావిస్తున్నా’’మన్నారు. -
నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారు?
-
‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ బాటలోనే’
సాక్షి, అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీ కనీస బాధ్యత కూడా లేకుండా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం లో బెల్ట్ షాపులు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని విడతల వారిగా రద్దు చేస్తామని వైఎస్ జగన్ చెప్పారని, దానిని అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మందు తాగండి అని ప్రోత్సహించింది చంద్రబాబు కాదా...?అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మద్యం అమ్మకాలకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చిందని మరి టీడీపీ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కరోనా నివారణకు సీఎం జగన్ చేపడుతున్న చర్యలను జాతీయ మీడియా సంస్థలు సైతం అభినందిస్తుంటే టీడీపీకి మాత్రం అవి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రాజ్‌భవన్‌లో ఎవరికో కరోనా వస్తే సీఎం జగన్ వల్లే వచ్చిందని పచ్చమీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. మరి హెరిటేజ్‌లో 40 మందికి కరోనా వస్తే పచ్చ బ్యాచ్ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రతి బిల్డింగ్‌కి పచ్చరంగులు వేసినప్పుడు, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో రంగులపై చేస్తున్నట్లుగా ఎందుకు రాద్దాంతం చేయాలేదని మండిపడ్డారు. ఆకుపచ్చ రంగు హరిత వనానికి, తెల్లరంగు శాంతికి, నీలం రంగు నీటి ప్రవాహానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. (వైఎస్సార్ మత్స్యకార భరోసా చెల్లింపులు ప్రారంభం) కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరగకుండా అనుక్షణం సమీక్షలు జరుపుతున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనాతో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పింది అక్షర సత్యమని, ఇదే విషయాన్ని మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా చెప్తున్నారన్నారు. అవేవి టీడీపీ నేతలకు కనపడవా అన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే సరిపోయిందని ఆయన విమర్శించారు. చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు విజయవాడకు వచ్చి అక్రమంగా కట్టిన ఇంట్లో క్వారంటైన్లో ఉండాలన్నారు. చంద్రబాబు విద్యార్థులకు, మహిళలకు ఎగ్గొట్టిన బకాయిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లించడం తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో మూడు దఫాలు ఉచిత రేషన్ ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అలా ఇవ్వడమే జగన్ చేసిన తప్పా అని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు. (వారి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: సీఎం జగన్) -
‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’
సాక్షి, అమరావతి : చంద్రబాబు దుర్మార్గాల వల్లనే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపారని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూ రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు ప్రపంచ బ్యాంకు దృష్టి తీసుకెళ్లారని వెల్లడించారు. కౌలు రైతులు, రైతులను టీడీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిన కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. తమ భూములు కాజేస్తున్నారని దళితులు ప్రపంచబ్యాంకుకు సమాచారమిచ్చారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. -
జగన్ సీఎం అయితే పింఛన్ పెంపు
రాయచోటి, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే వృద్ధుల పెన్షన్‌ను రూ. 200 నుండి రూ.700 లకు పెంచడం జరుగుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెన్నముక్కపల్లె పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్ శ్రీనివాసులురెడ్డితో కలసి ఎమ్మెల్యే వృద్ధులు, వికలాంగ, వితంతువులకు రూ.3.44 లక్షల పెన్షన్ డబ్బులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన పెన్షన్‌దారులతో మాట్లాడుతూ వృద్ధులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న రూ. 200 పెన్షన్ వారి మందుల కొనుగోలుకు కూడా చాలడం లేదన్నారు. ఈవిషయాన్ని గుర్తెరిగి రూ.200 పింఛన్‌ను రూ.700లకు పెంచేందుకు జగన్ సుముఖంగా వున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు విషయాన్ని ప్రకటిస్తారన్నారు. గ్రామంలోని చెన్నముక్కపల్లె, దూళ్ళవారిపల్లెలకు కూడా రోళ్లమడుగు నీరందేలా చూస్తానంటూ చెప్పారు. గ్రామంలోని అర్హులందరికీ ఇళ్ళపట్టాలతో పాటు పక్కాగృహాల మంజూరుకు కృషి చేస్తానంటూ హామీఇచ్చారు.మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి, గ్రామ నేతలు, పంచాయతీ కార్యదర్శి భాస్కరాచారి, సీఎస్సీ లక్ష్మిసుజాత పాల్గొన్నారు.