‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్‌ బాటలోనే’ | AP State Chief VIP Gadikota Srikanth Reddy Fires On TDP | Sakshi
Sakshi News home page

‘ఆ విషయంలో పచ్చ బ్యాచ్‌ ఎందుకు స్పందించలేదు?’

Published Wed, May 6 2020 4:12 PM | Last Updated on Wed, May 6 2020 4:12 PM

AP State Chief VIP Gadikota Srikanth Reddy Fires On TDP - Sakshi

సాక్షి, అమరావతి:  కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీ కనీస బాధ్యత కూడా లేకుండా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం లో బెల్ట్ షాపులు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని విడతల వారిగా రద్దు చేస్తామని వైఎస్ జగన్ చెప్పారని, దానిని అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మందు తాగండి అని ప్రోత్సహించింది చంద్రబాబు కాదా...?అని శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. మద్యం అమ్మకాలకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చిందని మరి టీడీపీ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కరోనా నివారణకు సీఎం జగన్‌ చేపడుతున్న చర్యలను జాతీయ మీడియా సంస్థలు సైతం అభినందిస్తుంటే టీడీపీకి మాత్రం అవి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రాజ్‌భవన్‌లో ఎవరికో కరోనా వస్తే సీఎం జగన్‌ వల్లే వచ్చిందని పచ్చమీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. మరి హెరిటేజ్‌లో 40 మందికి కరోనా వస్తే పచ్చ బ్యాచ్‌ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రతి బిల్డింగ్‌కి పచ్చరంగులు వేసినప్పుడు, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో రంగులపై చేస్తున్నట్లుగా ఎందుకు రాద్దాంతం చేయాలేదని మండిపడ్డారు. ఆకుపచ్చ రంగు హరిత వనానికి, తెల్లరంగు శాంతికి, నీలం రంగు నీటి ప్రవాహానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. (వైఎస్సార్ మత్స్యకార భరోసా చెల్లింపులు ప్రారంభం

కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరగకుండా అనుక్షణం సమీక్షలు జరుపుతున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనాతో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పింది అక్షర సత్యమని, ఇదే విషయాన్ని మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా చెప్తున్నారన్నారు. అవేవి టీడీపీ నేతలకు కనపడవా అన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే సరిపోయిందని ఆయన విమర్శించారు. చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు విజయవాడకు వచ్చి అక్రమంగా కట్టిన ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలన్నారు. చంద్రబాబు విద్యార్థులకు, మహిళలకు ఎగ్గొట్టిన బకాయిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లించడం తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో మూడు దఫాలు ఉచిత రేషన్ ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అలా ఇవ్వడమే జగన్‌ చేసిన తప్పా అని టీడీపీ నేతలను శ్రీకాంత్‌ రెడ్డి నిలదీశారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు. (వారి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: సీఎం జగన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement