రాయచోటి : కడప జిల్లా రాయచోటిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రాయచోటి 'రణభేరి'కి అపూర్వ స్పందన లభించింది. సుమారు లక్ష మంది ఈ భేరీకి తరలివచ్చారు. రైతులతో పాటు ద్వాక్రా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతోపాటు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారంతా ఈ వేదిక మీదుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమైక్యాంధ్రకు మద్దతుగా లక్కిరెడ్డిపల్లిలో రిలే దీక్షలు చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలకు అశోక్‌బాబు సంఘీభావం తెలిపారు.
రాయచోటిలో సమైక్య 'రణభేరి'
Published Thu, Sep 26 2013 11:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement
Advertisement