ఉన్నత చదవు చదివాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తి చెందలేదు. డబ్బుపై వ్యామోహం పెరిగింది. వంచన మార్గం ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద నాయకులనే టార్గెట్ చేశాడు. కొంత కాలం తన ఆటలు సాగాయి. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు హైటెక్ మోసగాడు. పేరు బాలాజీ నాయుడు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం వాసి ఇతను.
సాక్షి, రాయచోటి(కడప): సమాజంలో మోసగించే వాళ్లు ఉన్నతంత కాలం మోసపోయే వాళ్లూ ఉంటారు. అలాంటి వారు పలు మార్గాల్లో అమాయకులను ఎంచుకుంటారు. చీటీలు, రియల్ ఎస్టేట్, ఒకటి కొంటే మరోక్కడి ఉచితం, రూ. పది వేలు దాస్తే చాలు మీకు రూ. లక్షలు ఇస్తాం ..అంటూ.ఇలా మోసం చేయడానికి ఎత్తులు వేస్తుంటారు. ఈ మాయ గాళ్ల ఉచ్చులో సామాన్యులు చిక్కుకుని నష్టపోతున్నారు. కానీ ఈ సారి బడా బాబుల వంతు వచ్చింది.
మంత్రులు, నాయకులే టార్గెట్ చేశాడు ఓ ఘరానా మోసగాడు. ఒక ఫోన్ కాల్‌తో వాళ్ల జేబులకు చిల్లు వేశాడు. అది కూడా ఒకరా ఇద్దరా....వందమందికి పైగా నాయకులు ఆ బడా మాయగాడి చేతిలో మోసపోయారు. పైకి అమాయకుడిలా కనిపించే ఆ ఘరానా మోసగాడి పేరు తాట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి, అలియాస్ అనిల్‌కుమార్. తూర్పు గోదావరి పిఠాపురం. ఇతడు జేన్‌టీయూ కళాశాలలో బీటెక్ చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. జీతం చాలదనుకొని తెలివితేటలను ఉపయోగించి గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పేరు గాంచిన ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసుకున్నాడు.
సచివాలయం నుంచి ఫోన్ అంటూ..
ఒక్కొరికి ఫోన్ చేసి సార్ నేను సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు కోరినట్లుగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాలంటే మాకు పర్సెంటెజ్ ఇవ్వాలి. ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతా ద్వారా డబ్బులు జమచేయమని చెబుతాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రూ. కోట్లలో దండుకున్నాడు. వీరి జాబితాలో గత ప్రభుత్వంలో కడప జిల్లా మంత్రి కూడా ఆ జాబితాలో ఉండటం విశేషం. ఆయన కూడా లక్షలాది రూపాయాలు సమర్పించుకున్నాడు. కానీ బయటకు చెప్పుకోలేక గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల ద్వారా ఆ మోసగాడిని పట్టుకోమ్మని పురమాయించారు.
మాయగాడి ఉచ్చులో జిల్లా వాసులు
2017లో జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు రాయచోటికి చెందిన ప్రజాప్రతినిధితో మారో ద్వితియ శ్రేణి నాయకుడుకి కూడా గాలం వేశాడు. వీరు కూడా ఈ మోసగాడికి భారీగా చెల్లించుకున్నారు. తరువాత ఇతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో ఉల్లిక్కి పడ్డారు. విషయం తెలిసి ఎవరికి చెప్పాలో తెలియక గుట్టుచప్పుడు కాకుండా రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చదవండి : పీడీజేకు ఫోన్ చేసి దొరికిపోయిన నిందితుడి సోదరుడు
ఎట్టకేలకు అరెస్ట్
అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. నిందితుడిని పట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. చివరికి మంగళవారం రాత్రి తెల్లవారు జామున హైదరాబాద్‌లో అరెస్టు చేసి రాయచోటికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం రాయచోటి కోర్టుకు హాజరు పెట్టారు. కోర్టు నిందిడికి రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇవ్వడంతో మరో కంటికి కనిపించకుండా పోలీసులు హైదరాబాద్‌లోని చెంచ్‌ల్ గూడా జైల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. నిందితుడిని పట్టుకున్న వారిలో రాయచోటి ఎస్‌ఐ మహమ్మద్ రఫీ, అర్బన్ సీఐ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment