వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు.
రాయచోటి: వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి బొట్లచెరువు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.96,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.