ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కడప అర్బన్ : కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే దుర్మార్గుడిలా మారాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో శనివారం తల్లి, బిడ్డ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రాయచోటి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై(16) కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
విషయం తెలుసుకున్న తల్లి బాధితురాలిని వెంట తీసుకుని రాయచోటి పోలీసు స్టేషన్‌కు వెళితే వారు ఫిర్యాదు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో వారు ఎస్పీని కలవగా స్పందించిన ఎస్పీ వెంటనే దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని రాయచోటి పోలీసులను ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment