wife complaint against husband
-
పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య
సాక్షి, ఏలూరు టౌన్ : భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతోపాటు, స్టేషన్‌కు రావాలని పోలీసులు పిలవటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరానికి చెందిన కే.బాలరాజుకు ఏలూరు శివారు చొదిమెళ్ల గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు బాలరాజు. ఇటీవల అత్తింట్లో బంధువు మృతి చెందటంతో బట్టలు పెట్టేందుకు భార్య స్వగ్రామం చొదిమెళ్ల వెళ్లారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) ఈ నేపథ్యంలో ఈ నెల 17న బాలరాజు, జ్యోతి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య చీమలమందు తాగటంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సతో ఆరోగ్యం కోలుకుని ఇంటికి తిరిగివెళ్లింది. భర్త బాలరాజు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, కొడుతున్నాడంటూ జ్యోతి 100 నంబర్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసింది. గురువారం ఉదయం ఏలూరు రూరల్ పోలీసులు బాలరాజుకు ఫోన్ చేసి విచారణ నిమిత్తం రావాలని చెప్పారు. జ్యోతి తన తండ్రిని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) బాలరాజు కూడా స్టేషన్‌కు వెళుతున్నానంటూ చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే స్టేషన్‌కు వెళ్లకుండా పవర్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతండ్రే.. కర్కోటకుడయ్యాడు..
సాక్షి, కడప అర్బన్ : కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే దుర్మార్గుడిలా మారాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో శనివారం తల్లి, బిడ్డ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రాయచోటి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై(16) కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లి బాధితురాలిని వెంట తీసుకుని రాయచోటి పోలీసు స్టేషన్‌కు వెళితే వారు ఫిర్యాదు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో వారు ఎస్పీని కలవగా స్పందించిన ఎస్పీ వెంటనే దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని రాయచోటి పోలీసులను ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే ...’
విజయవాడ : పదేళ్లు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధి వక్రీకరించి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే షరతులు వర్తిస్తాయి’ అనడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె న్యాయం కోసం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే పటమట రామచంద్రానగర్‌కు చెందిన కొప్పురావూరి సంధ్యారాణి తన భర్త నవీన్‌కుమార్ రెండున్నర నెలల కిందట వదిలేసి వెళ్లాడని పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేసింది. భర్త గవర్నరుపేటలోని తన మామ కొప్పురావూరి నటరాజు ఇంట్లో ఉంటున్నాడని, తన రెండున్నరేళ్ల కుమార్తె శ్రీ చిన్విని కూడా అక్కడే ఉంచుకొని చూపించడం లేదని ఆమె పేర్కొంది. రెండో పెళ్లికి సిద్ధపడిన తన భర్త పేరొందిన న్యాయవాది పేరు చెపుతూ తననేమీ చేయలేరంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కుమార్తెనైనా చూ పించాలంటూ పోలీస్ కమిషనర్‌ను ఆమె వేడుకుంది. దీనిపై మహిళా పోలీ సు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇదీ జరిగింది 2001లో సంధ్యారాణి ఇంటర్మీడియెట్ చదువుతుండగా బియ్యం వ్యాపారి నట రాజు కుమారుడు నవీన్‌కుమార్‌తో స్నే హితుల ద్వారా పరిచయమైంది. తరువాత ప్రేమలో పడిన వీరు 2010లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రామచంద్రానగర్‌లో ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల శ్రీ చిన్వి, మూడు నెలల జిజ్ఞేశ్వర్ సం తానం. నవీన్ గత మే 16న కుమార్తెను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. పలుమార్లు వెళ్లి ప్రాథేయపడినా రాకపోగా, కుమార్తెను కూడా చూ పించడం లేదు. ఇందుకు తన మామే కారణమని ఆమె పేర్కొంది. తన మామ బలవంతంతో మరో వివాహం చేసుకునేందుకు నవీన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. షరతులు పెడుతున్నాడు తన కుమార్తెను చూపించేందుకు భర్త షరతులు పెడుతున్నాడని సంధ్యారాణి ఆరోపిస్తోంది. రెండో వివాహం ఇష్టమేనని, ఆస్తిలో వాటా అడగనని, భవిష్యత్‌లో అత్తమామలపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు చేయకూడదంటూ ఒప్పంద పత్రంపై సంతకం పెట్టాలంటున్నట్టు ఆమె పేర్కొంది. ఇది జరిగితే కుటుంబ ఖర్చులు పెట్టుకొని వారంలో ఒకరోజు పాపను తీసుకువచ్చి తన ఇంట్లో గడుపుతానని చెపుతున్నాడని, ఇలా చేయకపోతే పిల్లలు తనకు పుట్టలేదని ప్రచారం చేస్తారని బెదిరిస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది.