విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రలో అధికం | More Power plants in Seemandhra regions | Sakshi
Sakshi News home page

విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రలో అధికం

Published Fri, Oct 18 2013 1:08 AM | Last Updated on Mon, Jul 29 2019 6:10 PM

విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రలో అధికం - Sakshi

విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రలో అధికం

సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం)కు ఇంధనశాఖ నివేదిక సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు...
     విద్యుత్ ఉత్పత్తి: రాష్ట్రం మొత్తం సామర్థ్యం 15,407.81 మెగావాట్లు. సీమాంధ్రలో 9,508.70 మెగావాట్లు, తెలంగాణలో 5,899.11 మెగావాట్లు ఉత్పత్తి.
     విద్యుత్ వినియోగం: 2013-14 టారీఫ్ ఆర్డర్ ప్రకారం.. తెలంగాణలో 46,030.47 మిలియన్ యూనిట్లు, సీమాంధ్రలో 43,903.96 ఎంయూ.    

400 కేవీ, 220 కేవీ, 132 కేవీ(ఎక్స్‌ట్రా హై-టెన్షన్-ఈహెచ్‌టీ) సబ్‌స్టేషన్లు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 447. తెలంగాణలో 211, సీమాంధ్రలో 236.
     33/11 కేవీ సబ్‌స్టేషన్లు: మొత్తం 4429. సీమాంధ్రలో 2,333, తెలంగాణలో 2096.
     డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్ (డీటీఆర్): రాష్ట్రవ్యాప్తంగా 9,99,984. సీమాంధ్రలో 5,45,690. తెలంగాణలో 4,54,294.
     విద్యుత్ కనెక్షన్లు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీలను కలుపుకొని 2,55,73,811. తెలంగాణలో 1,07,51,630, సీమాంధ్రలో 1,48,22,181. వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే అయితే సీమాంధ్రలో 13,92,489. తెలంగాణలో 18,60,493.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement