తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఉదయం తొలిసారి సమావేశమైంది. గంట పాటు జరిగిన సమావేశమనంతరం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వివరాలను వెల్లడించారు.
తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఉదయం తొలిసారి సమావేశమైంది. గంట పాటు జరిగిన సమావేశమనంతరం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వివరాలను వెల్లడించారు. ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించినట్టు తెలిపారు. ఈ నెల 19న రెండో విడత సమావేశం కానున్నట్టు ఆజాద్ వివరించారు.
తాజా భేటీలో కేంద్రమంత్రులు ఆజాద్తో పాటు సుశీల్కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, నారాయణస్వామి పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఎ.కె.ఆంటోనీ హాజరుకాలేదు. మరో మంత్రి చిదంబరం విదేశీ పర్యటనలో ఉన్నారు.