హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఎర్రవల్లి ప్రోగ్రామ్ గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న తనతో చర్చించలేదని జగ్గారెడ్డి ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోయేలా ఆదేశాలు ఇవ్వండి.. లేదంటే పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించి అందరినీ కలుపుకొనిపోయే మరోకరికి అవకాశం ఇవ్వండంటూ కాంగ్ అధిష్టానాన్ని లేఖలో జగ్గారెడ్డి కోరినట్లు సమాచారం.
జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడ తప్పుబట్టారు. ఇదిలా ఉంటే గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండకు వెళ్తుండగా పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment