సాక్షి,గుంటూరు:తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(జనవరి20) కొలికపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11వ తేదీన ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.
ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని అధిష్టానం కొలికపూడిని ఆదేశించింది.తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర సీఎం చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్టీ మహిళపై దాడి అంశంలో క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను పార్టీ అధిష్టానం దృష్టికి క్రమశిక్షణ కమిటీ బృందం తీసుకువెళ్లనుంది.కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, దౌర్జన్యాలకు దిగడం కొలికపూడికి సర్వసాధారణమైపోయిందని టీడీపీలోని పలువురు నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో కొలికపూడి రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు.
లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని, రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఒక సందర్భంలో క్రిస్టియన్లుగా మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment