ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ఇంకా లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ రెండు లోకసభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఇంకా మౌనం వీడలేదు.
పార్టీ అధిష్టానం తాజాగా యూపీ అభ్యర్థుల నూతన జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ తన కంచుకోట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అమేథీ, రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇందుకోసం వారు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లేఖలు పంపుతున్నారని సమాచారం. అయితే నామినేషన్ల చివరి రోజున ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు. రాయ్‌బరేలీ సీటును గాంధీ కుటుంబం నుంచి వేరొకరికి వెళ్లేందుకు అనుమతించబోమని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా, మరొకరు రాష్ట్ర పార్టీలో కీలక పదవిలో ఉన్నారట.
Comments
Please login to add a commentAdd a comment